దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఢిల్లీ జేఎన్ యూ వివాదం తెలిసిందే. ఈ ఉదంతంపై దర్యాఫ్తు చేస్తున్న బృందం తాజాగా మధ్యంతరం నివేదికను సమర్పించింది. ఉగ్రవాది అఫ్జల్ గురు సంస్మరణ సభను నిర్వహించి.. జాతి వ్యతిరేక నినాదాలు చేయటం వివాదానికి కారణమైంది. దీనిపై కొన్ని రాజకీయ పక్షాలు మద్దుతు ఇవ్వటం.. దానికి భావస్వేచ్ఛ అన్న ట్యాగ్ తగిలించటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
ఇదిలా ఉంటే.. ఈ సభను నిర్వహించి.. జాతి వ్యతిరేక నినాదాలు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కన్నయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయటం తెలిసిందే. దీనిపై కొన్ని విపక్ష పార్టీలు వ్యతిరేకించాయి.
ఇదిలా ఉంటే.. దర్యాప్తు బృందం జరిగిన తాజా విచారణ నివేదికలో జాతి వ్యతిరేక నినాదాలు చేసిన బృందంలో కన్నయ్య ఉన్నట్లుగా తేల్చారు. క్యాంపస్ లో జరుగుతున్న జాతి వ్యతిరేక కార్యకలాపాల్లో అతడి పాత్ర ఉన్నట్లు వెల్లడైనట్లు పేర్కొనటం గమనార్హం. అయితే.. ఈ కేసులో తనను ఇరికించారని కన్నయ్య ఆరోపిస్తున్నారు. దర్యాప్తు సంస్థ నివేదిక నేపథ్యంలో కన్నయ్య మీద ఆరోపణలకు మరింత బలం చేకూరనుంది.