కేంద్రంపై క‌నిమొళి నిప్పులు... ఏం జ‌రిగిందంటే!

Update: 2022-03-17 11:05 GMT
ఇత‌ర రాష్ట్రాల‌కు తెలంగాణ రాష్ట్రానికి... కొన్ని విష‌యాల్లో చాలా వ్య‌త్యాసం ఉంది. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన అంశాల‌పై అధికార ప్ర‌తిప‌క్షాలు.. ఉమ్మ‌డిగా పోరాటం చేస్తాయి. రాష్ట్ర స‌మ‌స్య‌ల విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డే ప‌ప్ర‌స‌క్తే లేదు. ఇప్పుడు కూడా అలానే వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. తాజాగా తెలంగాణ అధికార పక్షం డీఎంకే కు చెందిన ఎంపీ, సీఎం స్టాలిన్ సోద‌రి క‌నిమొళి.. కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఏక భార‌త్-శ్రేష్ఠ్ భార‌త్‌! అంటూ.. కేంద్రం ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నా.. ఉత్త‌రాది రాష్ట్రాల‌కు ఇచ్చిన ప్రాధాన్యం ద‌క్షిణాది రాష్ట్రాల‌కు ఇవ్వ‌డం లేద‌ని.. తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

తాజాగా పార్ల‌మెంటులో జీరో అవ‌ర్‌లో క‌నిమొళి మాట్లాడుతూ.. రైల్వే శాఖ‌కు సంబంధించిన కేటాయింపుల ను ప్ర‌స్తావించారు. రైల్వే శాఖ విస్త‌ర‌ణ‌, అభివృద్ధి, ప్రాధాన్యం వంటివాటిపై ఆమె త‌న‌దైన శైలిలో విరుచు కుప‌డ్డారు. ఉత్త‌రాది రాష్ట్రాల‌కు ఇస్తున్న ప్రాదాన్యం ద‌క్షిణాది రాష్ట్రాల‌కు ఇవ్వ‌డంలేద‌ని విమ‌ర్శించారు.

కొత్త‌లైన్లు, షెడ్లు, ట్రైనింగ్ సెంట‌ర్లు.. వంటి నిర్మాణానికి సంబంధించి వివ‌క్ష చూపుతున్నార‌ని.. విరుచుకుప‌డ్డారు. తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2022-23 వార్షిక బ‌డ్జెట్‌లో రైల్వే శాఖ‌కు రూ.13200 కోట్ల‌ను పేర్కొన్నార‌ని.. తెలిపిన క‌నిమొళి.. ద‌క్షిణాది రాష్ట్రాల‌కు తీవ్ర అన్యాయం చేశార‌ని విరుచుకుప‌డ్డారు.

ఇంత పెద్ద బ‌డ్జెట్‌లో ద‌క్షిణాది రాష్ట్రాలైన త‌మిళ‌నాడు, ఏపీ, తెలంగాణ‌, కేర‌ళ, గోవా రాష్ట్రాల‌కు క‌లిపి కేవ‌లం 59 కోట్ల  రూపాయ‌లు మాత్రమే ప్ర‌తిపాదించార‌ని... ఈ నిధులు ఏ ప్రాతిప‌దిక‌న ఇచ్చారో చెప్పాల‌న్నారు. అంతేకాదు.. అస‌లు ఈ నిధుల‌తో ఆయా రాష్ట్రాల్లో ఏం చేయాల‌ని భావిస్తున్నార‌ని.. ఇప్ప‌టికే ఉన్న ప్రాజెక్టుల‌కు నిధులు కేటాయించ‌డం లేదని.. కొత్త‌వాటిని ప్ర‌తిపాదించినా.. ప‌ట్టించుకోవ‌డం లేదేని అన్నారు.

ఒకే దేశం.. ఉన్న‌త దేశం.. అనే భావన... కేవ‌లం మాట‌ల‌కేనా? అని నిలదీశారు. నిధుల కేటాయింపు, ప్రాధాన్యం విష‌యంలో.. కేంద్ర ప్ర‌భుత్వం ద‌క్షిణాది రాష్ట్రాల‌ను విడ‌దీసి చూస్తోంద‌ని.. క‌నిమొళి దుయ్య‌బ‌ట్టారు.

ఆమె చేసిన ప్ర‌సంగానికి.. త‌మిళ‌నాడుకు చెందిన అధికార‌పార్టీ ఎంపీలు.. విప‌క్ష పార్టీలు ఎంపీలు, స్వ‌తంత్రులు కూడా మ‌ద్ద‌తు తెల‌ప‌డం గ‌మ‌నార్హం. కొస‌మెరుపు ఏంటంటే.. ఇంత‌గా క‌నిమొళి గొంతు చించుకున్నా.. ఏపీ నుంచి ఒక్క ఎంపీ కూడా ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌న‌నార్హం.
Tags:    

Similar News