పేరుకేమో భారతీయ జనతా పార్టీ ఏపీ విభాగం అధ్యక్షుడు అయినా.. కన్నా లక్ష్మినారాయణ పని కరివేపాకులా ఉందని టాక్ వినిపిస్తూ ఉంది. ఏపీ బీజేపీ వ్యవహారాలు ఏవీ కన్నా లక్ష్మినారాయణ చెప్పుచేతల్లో లేవని ప్రచారం సాగుతూ ఉంది. పరిణామాలు కూడా అలానే ఉండటం గమనార్హం!
ఏపీ బీజేపీని ఢిల్లీ నుంచినే చాలా వరకూ శాసిస్తున్నారు. ఇక ఆ పార్టీలోకి తెలుగుదేశం నుంచి వచ్చిన నేతలు ఎక్కువగా ఉన్నారు. ఏకంగా టీడీపీ రాజ్యసభ విభాగాన్నే బీజేపీలోకి విలీనం చేసేశారు. అలాంటి వారు ఏకంగా ఎంపీ హోదాల్లో ఉన్నారు. వారు కన్నాను పార్టీ ఏపీ విభాగం అధ్యక్ష పదవి నుంచి తప్పించడానికి కూడా ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు.
వారు ఆ ప్రయత్నాల్లో ఏ మేరకు సఫలం అవుతారో కానీ ఇప్పుడు కూడా బీజేపీ వ్యవహారాలు ఢిల్లీ కనుసన్నల్లో నడుస్తున్నాయని టాక్. ఎవరు పార్టీలోకి చేరాలాన్నా - అంతా ఢిల్లీతో అనుసంధానం అవుతున్నారు.
తాము చేరేప్పుడు ఏపీ విభాగం అధ్యక్షుడికి సమాచారం ఇచ్చే వాళ్లు కూడా లేరట. చేరిన తర్వాత అయినా మాటమాత్రంగా కూడా ఆయనను కలవడం లేదట.
ఇక ఏపీ పరిస్థితుల గురించి ఏ మాత్రం అవగాహన లేని నార్తిండియన్ నేతలు ఇన్ చార్జిలుగా ఉన్నారు. వారు కూడా ఏపీ విభాగం అధ్యక్షుడిని పెద్దగా కలుపుకుని పోవడం లేదని సమాచారం.ఇలా పార్టీలో కన్నాకు పెద్దగా ప్రాధాన్యత కనిపించడం లేదనే ప్రచారం సాగుతూ ఉంది. అయితే తనకు ఒక హోదా ఉంది కాబట్టి.. ఆ హోదాలో కన్నా స్పందిస్తూ ఉన్నారు. ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు.
అయితే ఆయన పార్టీ పెద్దరికానికి మాత్రం బీజేపీ వాళ్లు విలువను ఇవ్వడం లేదని - బీజేపీ అంతా సోషల్ మీడియా రాజకీయం చేస్తూ.. ఆఖరికి ఎంతో అనుభవం ఉన్న కన్నా వంటి వారిని కూడా ఉపయోగించుకోకుండా సాగుతోందనే ప్రచారం సాగుతుండటం గమనార్హం.