అవి ప్రేమ లేఖలో.. లేక రాజకీయ ప్రశ్నల లేఖలో తెలియదు కానీ.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘటుగా ఐదు ప్రశ్నలతో ఓ లేఖ రాశాడు. ఈ మేరకు చంద్రబాబుకు రాసిన ఆ బహిరంగ లేఖను మీడియాకు విడుదల చేశారు.
కొద్దిరోజులుగా చంద్రబాబును టార్గెట్ చేసిన కన్నా.. ఆయన నాలుగేళ్ల పాలన వైఫల్యాలపై , అవినీతిపై ప్రతి వారం ఐదు ప్రశ్నలతో బహిరంగ లేఖలు రాస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎనిమిదో లేఖ రాయడం విశేషం. సహజంగా ఇందులో చంద్రబాబు అవినీతి పాలన.. పాలన వైఫల్యాలను ఎండగట్టాడు.
కన్నా లేఖలోని ప్రశ్నలు..
* టీడీపీ నేతలకు నామినేషన్ పద్ధతిలో ప్రభుత్వ పనులను ఇచ్చారు. దానిపై సీబీఐ విచారణకు సిద్ధమా.?
* అమరావతి రాజధాని కోసం భూములను సింగపూర్ కంపెనీలకు అప్పజెప్పడంలో ఆంతర్యం ఏమిటీ.? అక్కడ అవినీతి జరగడం లేదా.?
*ఆర్థిక నిర్వహణలో నేనే నంబర్ 1 అని చెప్పే మీరు.. 10.32 శాతం వడ్డీ బాండ్లను ఎందుకు జారీ చేయవలసి వచ్చిందో వివరిస్తారా.?
* చంద్రబాబు గారూ. ఎస్సీ ఎస్టీ నిధులను ఇతర పథకాలకు మళ్లించాడం వాస్తవం కాదా.? ప్రచారం కోసం ఇష్టానుసారంగా నిధులు మళ్లించి అన్యాయం చేస్తున్నారు..
*రాష్ట్రంలోని అపార ఖనిజ సంపదను టీడీపీనేతలు దోచుకుంటున్న మాట వాస్తవం కాదా.? ఇంత మైనింగ్ మాఫియా ఎప్పుడైనా కనిపించిందా.? చివరకు హైకోర్టు చీవాట్లు పెట్టినా స్పందించని మీ దైర్భాగ్య ప్రభుత్వం ఇంకా అధికారంలో కొనసాగే హక్కు ఉందా..?
అని ఈ ఐదు ప్రశ్నలను చంద్రబాబును నిలదీశారు.