ఏపీలో భారతీయ జనతా పార్టీ గేమ్ ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో తెలియదు కానీ, గేమ్ ఆడే ప్రయత్నాలు అయితే భారతీయ జనతా పార్టీ తరఫున ప్రారంభం అయ్యాయని స్పష్టం అవుతోంది. భారతీయ జనతా పార్టీ ఏపీలో ఈ ఎన్నికల్లో సాధించింది ఏమీ లేదు. ఓట్లు అయితే ఆ పార్టీకి పడలేదు. సీట్లను నెగ్గడం సంగతలా ఉంచితే, ఓట్లను పొందడం విషయంలో బీజేపీ వాళ్లు నోటాతో పోటీ పడ్డారు.
అలాంటి చోట కమలనాథులు ఏవో లెక్కలతో ప్రయత్నాలు ప్రారంభిస్తూ ఉన్నారు. ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతిలో తెలుగుదేశం చిత్తు అయ్యింది. ఇలాంటి నేపథ్యంలో ఈ పరిస్థితులను క్యాష్ చేసుకొంటూ కమలనాథులు తెలుగుదేశం పార్టీ స్థానంలో తాము పాగా వేయాలని భావిస్తున్నారట. తెలుగుదేశం పార్టీకి పూర్తిగా చెక్ చెప్పి, కమలనాథులే ప్రత్యామ్నాయ స్థానాన్ని సంపాదించాలి.. అనేది ఒక ప్రణాళిక.
తమకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం కాదని కన్నా చెప్పుకొచ్చారు. కేంద్ర కేబినెట్లోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరుతుందనేది ఒట్టి ఊహాగానమే అని ఆయన తేల్చేశారు. తద్వారా ఏపీలో తాము సొంతంగా బలపడాలనే యత్నం చేసే సంకేతాలను కూడా ఆయన ఇచ్చినట్టే అని పరిశీలకులు అంటున్నారు. మరి ముందు ముందు ఏపీలో భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు ఎలా ఉంటాయో.. అవి ఏ మేరకు ఫలితాలను ఇస్తాయో!
అలాంటి చోట కమలనాథులు ఏవో లెక్కలతో ప్రయత్నాలు ప్రారంభిస్తూ ఉన్నారు. ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతిలో తెలుగుదేశం చిత్తు అయ్యింది. ఇలాంటి నేపథ్యంలో ఈ పరిస్థితులను క్యాష్ చేసుకొంటూ కమలనాథులు తెలుగుదేశం పార్టీ స్థానంలో తాము పాగా వేయాలని భావిస్తున్నారట. తెలుగుదేశం పార్టీకి పూర్తిగా చెక్ చెప్పి, కమలనాథులే ప్రత్యామ్నాయ స్థానాన్ని సంపాదించాలి.. అనేది ఒక ప్రణాళిక.
ఇది చెప్పుకోవడానికి అయితే బాగానే ఉంది. అయితే ఎంత వరకూ వర్కవుట్ అనేది మాత్రం ప్రశ్నార్థకమే ప్రస్తుతానికి. కమలం పార్టీలో ఉన్న నేతలు మాత్రం సన్నాయి నొక్కులు ప్రారంభించారు. అందులో భాగంగా ఏపీ బీజేపీ విభాగం అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఇప్పుడు బీజేపీ తరఫున గళం విప్పుతూ ఉన్నారు. కేంద్ర కేబినెట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరుతుందనే ఊహాగానాలను ఆయన కొట్టి వేశారు.