ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని పరిస్థితులు ఏ మాత్రం బాగోలేవన్న తీరులో ఆయన మాటలు ఉన్నాయి. మూడు రాజధానుల విషయం లో విశాఖ ప్రజలు భయపడుతున్నట్లు చెప్పిన ఆయన.. విశాఖపట్నంలో పరిస్థితి ఏమీ బాగోలేదన్నారు. విజయనగరం ప్రజలు రాజధానిని మీరే కాపాడాలని తన తో అన్నట్లు చెప్పిన కన్నా.. సంచలన విషయాన్ని చెప్పుకొచ్చారు.
విశాఖపట్నం లో తన భూమిని.. తన పక్కన వాళ్ల భూమిని కబ్జా చేశారని.. తాను ఫోన్ చేసి అడిగితే.. ఈ భూమి మీదని తెలీదని వదిలేశారన్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం కల్పిస్తామన్న నమ్మకం ప్రజల్లో కల్పిస్తామన్నారు. కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ లో ఎన్నికలు జరిగితే తప్పించి ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగే అవకాశం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ అంశంపై తమ పార్టీతో కూడా మాట్లాడాలని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో తమ పార్టీ ఆఫీసు పక్కన ఉన్న భూమిని బెదిరించి లాక్కున్నట్లు చెప్పారు. అమరావతినే ఏపీ రాజధాని అని బీజేపీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని.. జనసేన తో కలిసిన తమను ప్రజలు ఆదరిస్తారని చెప్పారు. కన్నా వ్యాఖ్యలకు ఏపీ అధికారపక్ష నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.