మ‌నోడి హ‌త్య‌పై మోడీతో ఆ గ‌వ‌ర్న‌ర్ ఫీల‌య్యాడు

Update: 2017-03-09 04:51 GMT
తెలుగు ఇంజనీర్‌ శ్రీనివాస్‌ కూచిభొట్ల  గ‌త నెల‌లో అమెరికాలోని కన్సాస్‌ లో హత్యకు గురైన‌ ఘటనపై కన్సాస్‌ గవర్నర్‌ శామ్‌ బ్రౌన్‌ బ్యాక్‌ విచారం వ్యక్తంచేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకీ - శ్రీనివాస్‌ భార్య సునయనకూ లేఖలు రాశారు. అలాగే, ఈ ఘటనలో అలోక్‌ అనే మరో తెలుగు ఇంజనీర్‌ గాయపడటం పట్ల కూడా ఆయన తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ సంఘటన తనను ఎంతో కలచివేసిందనీ - విద్వేషాలను రెచ్చగొట్టే ఇటువంటి చర్యలను సహించబోమనీ, భారతీయులపైన జరుగుతున్న దాడులూ-వేధింపులు తననుఎంతో బాధించా యని ఆ లేఖలో పేర్కొన్నారు.

శ్రీనివాస్‌ హత్య - ఆ తర్వాత రెండు వారాల వ్యవధిలో అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు అమెరికాలో ప్రకంపనాలను సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ లేఖ రాశారు. " శ్రీనివాస్‌ ఎంతో ధీశాలి అనీ, పెద్దలను ఎంతో గౌరవించేవాడని విన్నా.అతడు తన కుటుంబాన్ని మాత్రమే కాక, దేశాన్ని ఎంతో ప్రేమించాడనీ తెలుసుకున్నాను. అలాంటి వ్యక్తిని పోగొట్టుకున్నందుకు ఎంతో బాధ పడుతున్నాను" అని కన్సాస్‌ గవర్నర్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. కన్సాస్‌ లో ఇల్లు కట్టుకుని స్థిరపడేందుకుఎన్నో కలలుగన్న శ్రీనివాస్‌ ఇలా అర్ధంతరంగా హత్యకు గురి కావడం తనను ఎంతో కలచివేసిందని గవర్నర్‌ పేర్కొన్నారు. శ్రీనివాస్‌ ని పోగొట్టుకుని పుట్టెడు దు:ఖంలో ఉన్నా ఆయన ఆశ యాల సాధనకోసం కృషి చేస్తానని భార్య సునయన ప్రకటించిన తీరు తనను ఎంతో కదిలించిందనీ, ఆమె కృత నిశ్చయాన్ని ధీశక్తిని అభినందిస్తున్నానని గవర్నర్‌ పేర్కొన్నారు. శ్రీనివాస్‌ వంటి వారి వల్లే తమ రాష్ట్రం ఎంతోపురోగతిని సాధించిందనీ, అలాంటివారిని తమ రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు.

కాగా, కన్సాస్‌ గవర్నర్‌ టోపెకాలో భారత కాన్స్యులేట్‌ జనరల్‌ డాక్టర్‌ అనుపమ్‌ రాయ్‌ కూడా కలుసుకుని శ్రీనివాస్‌ హత్య పట్ల తీవ్ర దిగ్భ్రాంతినీ - సంతాపాన్ని తెలిపారు.కన్సాస్‌ లో నివసించేవారందరికీ భద్రత కల్పించేందుకు సిద్దమని గ‌వ‌ర్న‌ర్ హామీ ఇచ్చారు. కన్సాస్‌కి వచ్చేవారందరికీ స్వాగతం చెబుతున్నానని ఆయన అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News