వావ్..కపిల్ దేవ్ తన లవ్‌ను ఎంత స్వీట్ గా ప్రపోజ్ చేశాడో! అప్పట్లోనే ఎంత క్రియేటివిటీ!
మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ ఈ పేరు క్రికెట్ చరిత్రలో ఓ సంచలనం. 1983లో భారతక్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలుచుకుందంటే అందుకు కపిలే కారణం. అయితే అప్పట్లో కపిల్‌దేవ్ ఎందరో అమ్మాయిలకు డ్రీమ్ బాయ్. కపిల్ ఆటను చూసి మనదేశంలో ఎందరో క్రికెట్‌కు అభిమానులయ్యారు. నేడు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని మనదేశం శాసిస్తోంది. ప్రపంచస్థాయి ఆటగాళ్లు భారత్ నుంచి వస్తున్నారు. అందుకు కపిల్ ఇచ్చిన స్ఫూర్తే కారణం. అయితే ఇటీవల ఈ మాజీ క్రికెటర్ తన ప్రేమవిషయాలను, వ్యక్తిగత విషయాలను ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ నటి నేహా ధూపియాతో జరిగిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
1983 ప్రపంచకప్‌లో 175 పరుగులు బాది జింబాబ్వే బౌలర్లకు సింహస్వప్నంలా మారిన కపిల్ దేవ్.. తన ప్రేమను ఎలా చెప్పాలో తెలియక టెన్షన్ పడ్డాడట. తాను రోమీ భాటియాను లవ్ చేశాడు. ఆమెకు కూడా కపిల్‌కు పరిచయమే. కానీ ఆమెకు తన ప్రేమను ఎలా వ్యక్తం చేయాలో తెలియక ఎంతో టెన్షన్ పడ్డాడట. ఓ రోజు ఎలాగైనా తన లవ్ సంగతిని రోమీ భాటియాకు చెప్పాలని ఫిక్స్ అయ్యాడట. కపిల్ తన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడో ఆయన మాటల్లోనే.. 'ఓ రోజు నేను రోమీ భాటియా కారులో వెళ్తున్నాం. దారిలో నా ఫొటో ఉన్న ఓ అమూల్ యాడ్ హోర్డింగ్ కనిపించింది. దానిని రోమీకి చూపించి.. ఫొటో తీయమన్నా. ఇప్పుడు ఫొటో ఎందుకని రోమీ నన్ను ప్రశ్నించింది. భవిష్యత్తులో మన పిల్లలకు చూపేందుకని జవాబిచ్చా. విషయం అర్ధంచేసుకున్న రోమీ.. ప్రపోజ్ చేస్తున్నావా అంది. అవును అని అన్నాను. రోమీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మొత్తానికి అమూల్ యాడ్‌ను నా ప్రేమ కోసం అలా వాడుకున్నా' అని కపిల్ దేవ్ తెలిపారు.
అయితే కపిల్ ప్రేమకు రోమీ భాటియా తండ్రి ఒప్పుకున్నా.. తాతగారు మాత్రం ఒప్పకోలేదట. చివరకు ఆయనను ఒప్పించేందుకు కపిల్ నానా తంటాలు పడ్డారట. ప్రపంచకప్ గెలిచేందుకు మూడేళ్ల ముందు (1980)లో రోమీ భాటియా, కపిల్ దేవ్ ఓ ఇంటివారయ్యారు. అయితే ‘83’ పేరుతో కపిల్ దేవ్ బయోపిక్ వస్తున్నది. రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణెలు కపిల్, రోమీ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సీన్ కూడా సినిమాలో ఉన్నట్టు టాక్.