మీడియా వైఖరే చాలా విచిత్రంగా ఉంది. రాజ్యసభ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ పార్టీకి రాజీనామా చేశారు. ఎస్పీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్ధిగా రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ వేశారు. ఎప్పుడైతే కపిల్ సిబల్ పార్టీకి రాజీనామా చేశారో వెంటనే కాంగ్రెస్ కు షాకంటు జాతీయ, ప్రాంతీయ మీడియా ఒకటే రచ్చ రచ్చ చేస్తోంది. పార్టీకి కపిల్ ఇపుడు రాజీనామా చేసుండచ్చు కానీ చాలాకాలంగా దూరంగానే ఉంటున్న విషయం మీడియా మర్చిపోతోంది.
2014లో యూపీఏ కూటమి ఓడిపోయిన దగ్గరనుండే కపిల్ పార్టీ నాయకత్వానికి దూరమైపోయారు. ఏదో ముఖ్యమైన సమావేశాల్లో కొన్నింటికి మాత్రమే హాజరయ్యారు. పైగా పార్టీపై గాంధి ఫ్యామిలి ఆధితపత్యాన్ని వ్యతిరేకించిన జీ-23 మంది నేతల బృందంలో సిబల్ కీలకనేత. పార్టీ నాయకత్వాన్నే ధిక్కరిస్తు ఏకంగా సోనియాకే చాలా లేఖలు రాశారు. అంటే పార్టీతో సిబల్ చాలాకాలం క్రితమే మానసికంగా దూరమైపోయారని అర్ధమవుతోంది.
ఇక అసలు విషయానికి వస్తే పార్టీకి కపిల్ ఏ విధంగా ఉపయోగపడ్డారు ? పార్టీ తరపున చాలాసార్లు రాజ్యసభకు నామినేటయ్యారు. రాజ్యసభ ఎంపీ, సీనియర్ నేత హోదాలో మంత్రి పదవులు అనుభవించారు.
సిబల్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఏనాడు గెలిచిందిలేదు. ప్రజాబలంలేని ఇలాంటి వృద్ధ నేతల వల్లే కాంగ్రెస్ ఇప్పుడు పతనావస్థలో ఉంది. సిబల్ లాంటి నేతలు ఇంకా చాలా మందున్నారు పార్టీలో. ప్రజాబలం లేని గులాంనబీ ఆజాద్ లాంటి వృద్ధ నేతలు కూడా వెళ్ళిపోతే పార్టీకి పట్టిన దరిద్రం వదిలిపోతుంది.
పార్టీవల్ల లాభపడటం తప్ప పార్టీకి ఏ విధంగా ఉపయోగపడని సిబల్ లాంటి వ్యక్తి వెళ్ళిపోతే కాంగ్రెస్ కు ఏ విధంగా షాకవుతుందో మీడియానే చెప్పాలి. లాయర్ గా సిబల్ మంచిపేరుంది. అయితే ఇలాంటి లాయర్లు పార్టీలో ఇంకా చాలామందే ఉన్నారు.
తనకు పార్టీ తరపున ఎలాగూ రాజ్యసభకు వెళ్ళే అవకాశంలేదని అర్ధమైపోయింది. అందుకనే ఎస్సీతో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని ఆ పార్టీ మద్దతుతో రాజ్యసభకు పోటీచేస్తున్నారు.