బీసీ కోటా:అప్పుడే వారిలో డౌట్లు మొద‌ల‌య్యాయి

Update: 2017-12-01 18:56 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు కీల‌క నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. 2014 ఎన్నికల ప్రచారంలో కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన  చంద్రబాబు ఆ హామీకి అనుగుణంగానే కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. మంజునాథ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఏపీ కేబినేట్ తీర్మానించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గంలో ఈ మేరకు నిర్ణయించారు. కాపు - తెలగ - బలిజ - ఒంటరి కులాలకు 5శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించి ఈ వర్గాలను BC -F కేటగిరిలో చర్చాలని యోచిస్తున్నారు. అయితే ఇప్పుడే ఈ ఉదంతంపై భిన్నాభిప్రాయాలు...ఏపీ ముఖ్య‌మంత్రి బాబుపై సందేహాలు ముసురుకుంటున్నాయి.

కాపు సామాజిక‌వ‌ర్గంలో జ‌రుగుతున్న చ‌ర్చ‌ - సోష‌ల్ మీడియాలో సాగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం మంజునాథ కమిషన్‌ ఇచ్చిన నివేదికకు ఏపీ మంత్రి మండలి ఆమోద ముద్ర వేసి ఈ కోటా క‌ల్పించిన సంగ‌తి తెలిసిందే. అయితే మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు కామెంట్లు ఆధారంగా ఈ కోటా వెనుక సందేహాలు వ్య‌క్త‌మవుతున్నాయి. కేవలం కమిటీలోని మెజారిటీ సభ్యులు మద్దతు ఇచ్చారు తప్పితే -  మంజునాథ క‌మిటీ అభిప్రాయం ఇంకా తెలియచేయలేదు అని మంత్రి గంటా శ్రీనివాస్ రావు చెబుతున్నార‌ని...మ‌రి అటువంటప్పుడు రిపోర్ట్  పూర్తి అనుకూలంగా వచ్చింది అని ఎలా చెబుతున్నార‌ని స‌ద‌రు కాపులు ప్ర‌శ్నిస్తున్నారు

ఇప్పటికే బీసీ జాబితాలో 143 కులాలున్నాయని...ఇప్పుడు కాపులు - బలిజ - తెలగ - ఒంటరి కులాలు చేర్చడం వలన మొత్తం 147 కులాలు అయి బీసీలలో 6 వర్గాలుగా గుర్తింపు పొందుతారని ప్రకటించారని, కాపులకు 5% విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కలిపించినట్లుగా ప్రకటన చేస్తున్నారని అయితే...ఇదో కొత్త నాటకం అని ప‌లువురు మండిప‌డుతున్నారు. మంజునాథ క‌మిటీ నివేదిక పూర్తి రిపోర్ట్ రాకుండానే - అసెంబ్లీ తీర్మానం కాకుండానే, రాష్ట్రపతి అమోదం లేకుండానే, దీనిని రాజ్యాంగం 9 షెడ్యూల్లో చేర్చకుండానే, కాపులకు రిజర్వేషన్ కలిపించినట్లుగా ప్రకటన చేయటం, కాపులను నిలువునా మ‌ళ్లీ మోసం చేయటమే కాదా? అంటూ  లాజిక్ ప్ర‌శ్న వేస్తున్నారు.
Tags:    

Similar News