కరణం బలరాం.. దాదాపు 40 రాజకీయ ఇండస్ట్రీ. సీనియర్ దిగ్గజ నాయకుడినని చెప్పుకొంటారు. అయితే.. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎటూ కాకుండా పోతోందనే వాదన ఆయన అనుచరుల నుంచే వినిపిస్తోంది. గత 2014 వరకు టీడీపీలో ఉన్నఆయన 2019 ఎన్నికల్లోనూ టికెట్ సంపాయించుకుని చీరాల నుంచి విజయం దక్కించుకున్నారు. అనంతరం.. ఆయన ఏ కారణంతోనో తెలియదు.. కానీ, వైసీపీ పంచన చేరిపోయారు. దఅయినా.. కొన్నాళ్ల పాటు.. టీడీపీకి అనుకూలంగా ఉన్నారనే వాదన వినిపించింది. దీనిపై వైసీపీ అధిష్టానం కన్నెర్ర చేసి.. ఆయనకుక్లాస్ ఇవ్వడంతో వాట్సాప్ గ్రూపుల నుంచి బయటకు వచ్చారు. దీంతో టీడీపీకి ఆయన దూరమయ్యారు.
అయితే.. ఎక్కడో ఒకచోట మాత్రం ఆయనకు ఇంకా టీడీపీపై ఆశలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తనకు చీరాల టికెట్ ఇవ్వకపోతే.. అప్పుడు.. టీడీపీలోకి జంప్ చేయాలనే ఆలోచన తమ నాయకుడికి ఉందని.. కరణం వర్గమే..కొన్నాళ్ల కిందట ప్రచారం చేసింది. దీంతో ఆయన సేఫ్ జోన్‌లోనే ఉన్నారనే సంకేతాలు పంపించారు. కానీ, రాజకీయాలు ఎప్పుడూ.. ఒకేలా ఉండవు కదా..
ఇప్పుడు అదే జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. చీరాల అసెంబ్లీ టికెట్‌ను ఆయన తన తోడల్లుడు.. మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకుమారుడు.. దగ్గుబాటి చెంచురామ్‌కు ఖరారు చేసినట్టుపార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే.. ఇక్కడ కరణం ఆశలపై నీళ్లు జల్లేశారనే అర్థం.
మరి.. ఇప్పుడు కరణం పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఆయన ఆశ్రయించిన పార్టీ వైసీపీ మాత్రం చీరాలను ఎట్టిపరిస్థితిలో ఇచ్చేది లేదని... అంటే.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కే అవకాశం ఇస్తామని.. అంటే.. ఆయన ఖచ్చితంగా పరుచూరుకు వలస వెళ్లకతప్పదు. పోనీ..
చీరాలలోనే ఉన్నా.. ఆమంచి వర్గం నుంచి వచ్చే వ్యతిరేకత ఆయనను ఇప్పటికీ భయపెడుతోందనే వాదన ఉంది. అసంతృప్తి సెగలు పెరిగితే..చీరాల నుంచి పోటీ చేసినా.. ఫలితం ఉండే అవకాశం లేదు. పైగా సొంత వారే పగవారయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇదిలావుంటే.. తొలిసారి దగ్గుబాటి కుటుంబం చీరాల నుంచి పోటీ చేస్తుండడం.. కూడా.. ఇక్కడ భిన్నమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది.
ఆర్థికంగా బలంగా ఉండడం.. ఇటు.. బీజేపీ నేతలు కూడా.(పురందేశ్వరి ఆ పార్టీలో ఉన్నారు కనుక) దగ్గుబాటి చెంచురామ్‌కు మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. అనూహ్యంగా ఆమంచి వర్గం కూడా.. కరణంపై కోపంతో లోపాయికారీగా చెంచురామ్‌కు గుద్దేసినా.. ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదనే వాదన వస్తోంది. ఈ పరిణామాలను అంచనా వేస్తే.. ఖచ్చితంగా కరణం మూటాముల్లె సర్దుకోవడం ఖాయమని.. స్థానిక పొలిటికల్ వింగ్ అభిప్రాయపడుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.