కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తాజాగా ఓ హాట్ కామెంట్ చేశారు. కేసీఆర్ లో భక్తి ఎక్కువ అని. ఆయన కొడుకు కేటీఆర్ అస్సలు దేవాలయాలకే పోడని... మరి ఇప్పుడు సీఎం పీఠం కోసం తిరుమల వెళ్లి పూజలు చేశావా అని కేటీఆర్ ను విమర్శించాడు. ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. నిజంగానే తెలంగాణ సీఎం కేసీఆర్ లో భక్తిభావం ఎక్కువ. కేసీఆర్ గడిచిన కొన్నేళ్లుగా పూజలు, పునస్కారాలు, యాగాలు, హోమాలు చేస్తుంటారు. కానీ కేసీఆర్ తోపాటు కేటీఆర్ ఎప్పుడూ కనిపించరు. కేసీఆర్ ను అనుసరించరు. మంత్రి కేటీఆర్ ఎప్పుడూ నాస్తికుడిని అని చెప్పుకోనప్పటికీ ఏ మతపరమైన కార్యక్రమం వేడుకల్లో పాల్గొనకుండా ఆచారాలు పాటించకుండా దూరంగా ఉంటారు. కేసీఆర్ ఎల్లప్పుడూ దేవాలయాల సందర్శనతో కాలం గడుపుతుండగా.. కేటీఆర్ మాత్రం సొంతంగా దేవాలయాలను సందర్శించిన దాఖలాలు మాత్రం కనిపించలేదు. కేసీఆర్ గతంలో తిరుమలకు వెళ్లినప్పుడు కూడా కేటీఆర్ ఆయనతోపాటు వెళ్లలేదు.
అయితే సడన్ గా కేటీఆర్ మారి పోయారన్న చర్చ సాగుతోంది. తాజాగా కేటీఆర్ లోనూ మార్పు వచ్చింది. తిరుమల వెళ్లి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడం విశేషం. పూర్తిగా భక్తి భావంలోకి కేటీఆర్ వెళ్లి పోయారు. ఏంటా కథ అనేది ఆసక్తిగా మారింది. గత నెలలో కేసీఆర్ తోపాటు సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వరి స్వామిని కేటీఆర్ దర్శించుకున్నారు. సోమవారం వైకుంఠ ఏకదాశికి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు.
అయితే కేటీఆర్ భక్తిభావం వెనుక అధికార పీఠం కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ కు ఈ సంవత్సరం జాతకం ప్రకారం ‘రాజయోగం ’ దక్కుతుందని.. దీనిని సాధించడానికి, దేవతలను ఆరాధించాలని.. ప్రత్యేక పూజలు నిర్వహించాలని స్వయంగా కేసీఆర్ సూచించాడని టాక్ బయటకు వచ్చింది... అందుకే కేసీఆర్ సలహా మేరకు లేనిపోని పొరపాట్లు చేయవద్దనే కారణం తో కేటీఆర్ ఇలా దేవాలయాల బాట పట్టినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.