హనీట్రాప్..ఆపుకోలేక అడ్డంగా బుక్కైపోయాడు!

Update: 2019-11-30 14:21 GMT
కన్నట నాట రాజకీయాల్లో పెను సంచలనం రేకెత్తిస్తున్న హనీట్రాప్ లో నిజంగానే గంటగంటకూ ఆసక్తి రేకెత్తిస్తున్న అంశాలు వెలుగు చూస్తున్నాయి. అస్సలు ఆపుకోలేకపోతున్న తన వైఖరితో అడ్డంగా బుక్ అయిపోయిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఇప్పుడు నెత్తీనోరు బాదుకుంటున్నాడు. అయినా అప్పటికే నిండా మునిగిపోయాక... ఇక బావురుమంటే ఏం లాభమన్న రీతిలో సదరు ఎమ్మెల్యేపై సెటైర్లు పేలుతున్నాయి. కర్ణాటకలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తమంతట తాముగా వచ్చి పరిచయం చేసుకున్నంతనే... ఆత్రాన్ని ఆపుకోలేకపోయి... పరిచయం అయిన యువతితో పొందు కోసం 24 గంటలు కూడా ఆగలేకపోయిన సదరు ఎమ్మెల్యే ఇప్పుడు పోలీసుల ఎదుట నెత్తి పట్టికుని కూర్చున్నాడు.

కర్ణాటకలో జరిగిన హనీట్రాప్ లో ఎమ్మెల్యేలతో పాటు అనేక మంది ప్రముఖులు - శ్రీమంతులు పడ్డారని సీసీబీ పోలీసులు చెబున్నారు. హనీట్రాప్ కేసులో అరెస్టు అయిన నిందితుడు రాఘవేంద్ర అలియాస్ రఘు - రాజేష్ మరో ఇద్దరు యువతులు అక్టోబర్ 12న బెంగళూరులోని ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గరకు వెళ్లి తాము టార్గెట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యేని పరిచయం చేసుకున్నారు. తాము ఆర్గానిక్ సైంటిస్టులు అంటూ ఎమ్మెల్యేతో పరిచయం చేసుకున్నారు. తరువాత బీజేపీ ఎమ్మెల్యేను మాయమాటల్లో దింపారు. ఎమ్మెల్యేతో పరిచయం చేసుకున్న యువతి అక్కడే అతనికి కొంటెగా సైగలు చేసింది. తాము రినైసెన్స్ హోటల్ లో రూంలో ఉన్నామని - మీరు ఓ సారి అక్కడికి రావాలని ఆ యువతి ఎమ్మెల్యేకి చెప్పి ఆయన మొబైల్ ఫోన్ నెంబర్ తీసుకుంది. అంతటితో ఆగని సదరు యువతి అదే రోజు రాత్రి ఎమ్మెల్యేకు ఫోన్ చేసి తాను ఒంటరిగా ఉన్నానని, రావాలని చెప్పిందట. ఇంకేముంది... యువతి కొటు చూపులతో చిత్తైపోయిన సదరు ఎమ్మెల్యే  మరుసటి రోజు (అక్టోబర్ 13) మద్యాహ్నం 4 గంటలకే  వస్తానని ఎమ్మెల్యే సమాధానం ఇచ్చాడు.

చెప్పినట్టుగానే హోటల్ లోని యువతి ఉన్న గదిలోకి ఆ ఎమ్మెల్యే వెళ్లాడు. అంతే అక్కడ అప్పటికే అర్దనగ్నంగా ఉన్న యువతి ఎమ్మెల్యేను రెచ్చగొట్టి ముగ్గులోకి దింపింది. తాను ఆయన మీద చాల రోజుల నుంచి మనుసుపారేసుకున్నానని - తన కోరిక తీర్చాలని రెచ్చగొట్టిన యువతి నగ్నంగా తయారై ఎమ్మెల్యేని నిండా ముగ్గులోకి దించేసిందట. ఈ క్రమంలో ఏమాత్రం ఆగలేకపోయిన ఆ ఎమ్మెల్యే - యువతితో రాసలీలల్లో మునిగిపోయాడు. ఇంకేముంది... యువతితో సదరు ఎమ్మెల్యే రాసలీలలు సాగిస్తున్న సమయంలో అదే గదిలో ఏర్పాటు చేసిన రహస్య కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ వెంటనే నిందితులు ఎమ్మెల్యేను బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారట. రూ.50 కోట్లు ఇస్తే సరే సరి... లేదంటే సదరు వీడియోలను టీవీ ఛానెళ్లకు ఇస్తామంటూ బెదిరింపులకు దిగారట. దీంతో బిక్కచచ్చిపోయిన ఎమ్మెల్యే... అంత ఇచ్చుకోలేనని, రూ.10 కోట్లు అయితే చూస్తానంటూ బేరాలు ఆడారట. ఈ క్రమంలో రూ.1 కోటి ఇచ్చిన ఎమ్మెల్యే.. మిగిలిన మొత్తాన్ని సర్దలేనంటూ పోలీసులను ఆశ్రయించాడట. ఈ తతంగాన్ని వేరెవరో పోలీసులకు చెప్పలేదు. స్వయంగా సదరు బాధిత ఎమ్మెల్యేనే చెప్పడం గమనార్హం.


Tags:    

Similar News