ఒక సభలో.. ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి బ్లూఫిలిం మాట వస్తుందన్నది ఊహించగలమా? అంటే.. ఎట్టి పరిస్థితుల్లో నో అనే చెబుతాం. కానీ.. తాజా ఉదంతం అందకు పూర్తి భిన్నం. ఒక ముఖ్యమంత్రి సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. బ్లూ ఫిలిం గురించి ప్రస్తావించటమే కాదు.. మీలో ఎంతమంది బ్లూఫిలిం చూస్తారని ప్రశ్నించిన వైనమిది. ఇంతకీ ఆ ముఖ్యమంత్రి ఎవరు? ఎందుకు ఆయన ఆ విషయాన్ని ప్రస్తావించాల్సి వచ్చింది? అన్నది చూస్తే..
ప్రజలను ఉద్దేశించి బ్లూ ఫిలిం గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరో కాదు.. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో బ్లూఫిలిం చూస్తూ దొరికిపోయిన బీజేపీ ఎమ్మెల్యే తీరును తప్పు పడుతూ బెల్గావీలో ఏర్పాటు చేసిన సభలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా సదరు ఎమ్మెల్యే తీరును తీవ్రంగా తప్పు పట్టారు.
అసెంబ్లీ దేవాలయం లాంటిదని.. అలాంటి చోట ఆ పాడు చిత్రాలు చూస్తారా? అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీలో ఎంతమంది బ్లూఫిలిం గురించి తెలుసు? అని ప్రశ్నించటమే కాదు.. మీలో ఎవరైనా అలాంటివి చూశారా? ప్రశ్నించారు. తన ప్రశ్నకు సమాధానం గురించి వెయిట్ చేయకుండానే.. దేవాలయం లాంటి పవిత్ర అసెంబ్లీలో అలాంటి వీడియోలు చూసే వారు రాజకీయాల నుంచి వైదొలగాలని మండిపడ్డారు. సిగ్గులేని పనులు చేసే వారు ప్రజాజీవితం నుంచి వైదొలగాలన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/