కర్ణాటక లేటెస్ట్ అప్‌డేట్స్: అధికారం దిశగా హస్తం.. గెలుపొందిన, ఓడిపోయిన ప్రముఖులు వీరే!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఉదయం 12.30 గంటల సమయానికి కాంగ్రెస్ 122 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు 113 స్థానాలు సరిపోతాయి. అంటే అవసరమైన మెజారిటీ కంటే కాంగ్రెస్ 9 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 73 స్థానాల్లో, జేడీఎస్ 23 చోట్ల, ఇతరులు ఆరు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
కాంగ్రెస్ ఇప్పటివరకు 34 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 14 స్థానాల్లో, జేడీఎస్ 2 స్థానాల్లో విజయం సాధించాయి.
ఇక ఫలితాలను పరిశీలిస్తే కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై షిగ్గావ్ లో విజయం సాధించారు. అయితే ఆయన సొంత జిల్లా హవేరిలో ఆరు అసెంబ్లీ స్థానాలు ఉండగా ఐదుచోట్ల కాంగ్రెస్ ముందంజలో ఉంది. కనకపురా స్థానంలో పీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ విజయం సాధించారు. వరుణ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఇక చెన్నపట్టణ స్థానం నుంచి మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి తొలుత వెనుకబడినా.. ఇప్పుడు ఆధిక్యంలోకి వచ్చారు. అలాగే హోళెనరసిపూర్ నియోజకవర్గంలో కుమారస్వామి సోదరుడు రేవణ్ణ (జేడీఎస్) ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అదేవిధంగా రామనగరలో కుమారస్వామి కుమారుడు, సినీ నటుడు నిఖిల్ (జేడీఎస్) తొలుత ఆధిక్యంలో కొనసాగగా ఇప్పుడు వెనుకపడ్డారు.
ఇక కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో సొంత పార్టీ పెట్టుకుని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, ఆయన భార్య గాలి అరుణ ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నారు. ముందు వారు వెనుకపడ్డా మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. బళ్లారి సిటీ నుంచి గాలి అరుణ, గంగావతి నుంచి గాలి జనార్దన్ రెడ్డి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
సొరబ స్థానంలో మాజీ సీఎం బంగారప్ప కుమారుల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఆయన ఇద్దరు కుమారుల్లో.. కుమార బంగారప్ప (బీజేపీ)పై మధు బంగారప్ప (కాంగ్రెస్) ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఇక బీజేపీ తనకు సీటు నిరాకరించడంతో కాంగ్రెస్ లో చేరిన మాజీ సీఎం జగదీశ్ షెట్టార్ హుబ్బళి ధార్వాడ్ సెంట్రల్ లో ఓటమి పాలయ్యారు.
బళ్లారి స్థానంలో బీజేపీ మంత్రి శ్రీరాములు ఓడిపోయారు. ఆయనపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగేంద్ర విజయం సాధించారు.
అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే చిత్తాపూర్‌లో ఆధిక్యంలో ఉన్నారు.
ఇక మాజీ సీఎం, బీజేపీ కురువృద్ధుడు యడియూరప్ప కంచుకోట అయిన శికారిపురలో ఆయన కుమారుడు విజయేంద్ర (బీజేపీ) ముందంజలో కొనసాగుతున్నారు.