క‌ర్ణాట‌క రూల్ బిహార్ లో అమ‌లు చేయాల‌ట‌

Update: 2018-05-17 04:11 GMT
ఎన్నిక‌ల త‌ర్వాత ఏర్ప‌డిన కూట‌మికి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన బ‌లం స్ప‌ష్టంగా ఉన్న‌ప్ప‌టికి గ‌వ‌ర్న‌ర్ కు ఉన్న విచ‌క్ష‌ణాధికారంతో అతి పెద్ద పార్టీగా నిలిచిన బీజేపీని ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించ‌టం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆర్జేడీ నేత‌.. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కుమారుడు తేజ‌శ్వియాద‌వ్ ఆస‌క్తిక‌ర వాద‌న‌ను వినిపించారు.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి స్ప‌ష్ట‌మైన మెజార్టీ రాని నేప‌థ్యంలో అక్క‌డి గ‌వ‌ర్న‌ర్ ఎన్నిక‌ల్లో ఎక్కువ సీట్లు గెలుచుకున్న బీజేపీకి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఛాన్స్ ఇచ్చార‌ని.. అదే రీతిలో బిహార్‌ లోనూ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవ‌కాశం ఇవ్వాల‌న్నారు.

బిహార్ లో త‌మ‌దే అతిపెద్ద పార్టీగా తేజూ గుర్తు చేస్తున్నారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు పెద్ద పార్టీనే అవ‌స‌ర‌మైతే.. బిహార్‌ లో అతి పెద్ద పార్టీ ఆర్జేడీ అని.. సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేలా క‌ర్ణాట‌క‌లో ఛాన్స్ ఇచ్చిన‌ప్పుడు బిహార్‌లో త‌మ‌కూ ఇవ్వాల‌న్నారు. తేజూ ఆశ కాక‌పోతే.. క‌ర్ణాట‌క రూల్ బిహార్ కు అప్లై అవుతుందా?  అందునా.. మోడీ.. అమిత్ షా లాంటోళ్లు కీల‌క స్థానాల్లో ఉన్న వేళ అన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.


Tags:    

Similar News