కొన్ని విషయాల్లో నోరు విప్పకుండా ఉండటానికి మించింది ఉండదు. కానీ.. రాజకీయంగా ఉన్న శత్రుత్వంతో నోరు విప్పేసి అభాసుపాలయ్యే నేతలు కొందరు ఉంటారు. తాజాగా చెప్పే నేత కూడా ఇదే కోవకు చెందుతారని చెప్పక తప్పదు. మారుతున్న కాలానికి తగ్గట్లు సింప్లిసిటీకి పెద్దపీట వేస్తూ.. ప్రజల చేత ఎన్నుకోబడిన నేతలు కాదు.. ప్రజలే వీఐపీలు అన్నది నోటీమాటగా కాకుండా.. చేతల్లో చూపించేలా కొన్నినిర్ణననయాలు తీసుకుంటుంటారు. ఇందులో నిజం పాళ్లు ఎంతన్నది పక్కన పెడితే.. ప్రజల్ని నమ్మించగలిగేలా చేసే టాలెంట్ కొద్ది మంది పాలకుల్లో ఉంటుంది. ప్రధాని మోడీ అదే కోవకు చెందుతారన్న అభిప్రాయాన్ని కొందరు విమర్శకులు వ్యక్తం చేస్తుంటారు.
దేశ రాజదాని సాక్షిగా తమ కష్టాలపై రోజుల కొద్దీ రైతులు నిరసనలు చేసినా.. పట్టించుకోని ప్రధాని.. సామాన్యుడిలో ఒకరిలా కలిసిపోయేందుకు.. తమ కార్ల మీద ఠీవీగా నిలిచే ఎర్రబుగ్గల్ని తొలగించేందుకు ఏ మాత్రం వెనుకాడని వైనం కనిపిస్తుంది. ఇందుకోసం తనదే కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న ఎర్రబుగ్గల్ని తీసేసేలా నిర్ణయం తీసుకొని దేశ ప్రజల మనసుల్లో తనదైన ముద్ర వేసే చాతుర్యం మోడీ సొంతం.
అయితే.. విధానాల పరంగా ప్రధాని మోడీని తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీకి చెందిన పాలకుడు ఒకరు.. మోడీ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం కానీ ఎర్రబుగ్గ తీయాలని ఆదేశిస్తే.. తాను ఎట్టి పరిస్థితుల్లో తీయనని తేల్చి చెబుతున్నారు. ఎర్రబుగ్గ తీయమని తమ రాష్ట్ర సర్కారు ఆదేవిస్తే తప్ప.. తాను తన ఎర్రబుగ్గను తీసేదే లేదంటున్నారు కర్ణాటక కాంగ్రెస్ మంత్రి ఖాదిర్.
తాను ఎర్రబుగ్గను తన కారు మీద మాత్రమే పెట్టుకున్నానే కానీ.. తల మీద కాదంటూ కాస్తంత వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన ఆయన.. తనకు కారును.. బుగ్గను ఇచ్చింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కానీ.. కేంద్రం కాదని.. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశిస్తేనే తన కారు మీద ఎర్రబుగ్గ తీసేస్తానని తన స్వామిభక్తిని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. మోడీ మీద తనకున్న ఆగ్రహాన్ని ప్రదర్శించటం.. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల తనకున్న అభిమానాన్ని ఈ రకంగా ప్రదర్శించి వార్తల్లోకి ఎక్కారు. ఇదంతా బాగుంది కానీ.. ఎర్రబుగ్గ కోసం మంత్రిగారు చేసిన రచ్చను ప్రజలు అర్థం చేసుకోకుండా.. అపార్థం చేసుకుంటే పరిస్థితి ఏమిటన్న ఆలోచన ఆయనకు రాలేదా? అన్నది అసలు ప్రశ్న.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/