ఎట్టకేలకు కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గం ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో సీఎం బీఎస్ యడియూరప్ప శనివారం సాయంత్రం సుమారు గంటపాటు సమావేశమై తీర్మానించారు. ఈమేరకు మంగళవారం సాయంత్రానికి కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించాలని భావిస్తున్నారు. అయితే తొలివిడతలో 11 – 13 మందికి మాత్రమే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
మంత్రివర్గంలో ఎవరికి చోటు ఇవ్వాలనే జాబితా ఆదివారం సాయంత్రానికి పంపిస్తామని అమిత్‌షా సమాధానం బదులిచ్చారు. ఫలితంగా ఈనెల 20వ తేదీ ఉదయం 10 గంటలకు బెంగళూరులోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సీఎం యడియూరప్ప నేతృత్వంలో శాసనసభాపక్ష సమావేశం నిర్వహిస్తారు. మంత్రిమండలి ఏర్పాటు గురించి తీర్మానిస్తారు. అదేరోజు సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించాలని ముహూర్తం ఖరారు చేసినట్లు యడియూరప్ప మీడియాకు తెలిపారు. అమిత్‌షాతో భేటీ అనంతరం సీఎం యడియూరప్ప నేరుగా విమానాశ్రయం వెళ్లి బెంగళూరుకు వెళ్లారు.
కరువు పరిహారంతో పాటు వరద పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత కేంద్రం నుంచి నిధులు విడుదల చేసే అవకాశం ఉందని యడియూరప్ప చెప్పారు. అయితే కరువు, వరద పరిహారం విడుదలపై కాంగ్రెస్ నాయకులు అనవసర రాజకీయం చేస్తున్నారని యడియూరప్ప మండిపడ్డారు. అమిత్‌షాతో భేటీకి ముందు ఆయన ఢిల్లీలోని కర్ణాటక భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్ర పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వివరించినట్లు తెలిపారు. త్వరలోనే కేంద్రం నుంచి పరిహారం విడుదల అవుతుందనే నమ్మకం ఉందన్నారు.
బాధితులకు పరిహారం అందజేయడంతో కేంద్రప్రభుత్వం కానీ, ప్రధాని నరేంద్రమోదీ కానీ అసమాధానం వ్యక్తం చేయలేదని చెప్పారు. అయితే పరిస్థితిని పరిశీలించి పరిహారం విడుదల చేస్తామని చెప్పారు. ఈమేరకు ఇప్పటికే కేంద్రమంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్ వరద ప్రాంతాల్లో పర్యటించి వెళ్లినట్లు తెలిపారు. అయినా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కర్ణాటకపై నిర్లక్ష్యం వహిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించడం తగదన్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ సూచన ప్రకారం కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్ విధించినట్లు సీఎం యడియూరప్ప తెలిపారు. శుక్రవారం సాయంత్రం నుంచి అన్ని ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారన్నారు.