కాశ్మీర్ ఫైల్స్ మూవీ పేరిట మోసాలు.. ఖాతాలు ఖాళీ

Update: 2022-03-18 01:30 GMT
కాశ్మీర్ ఫైల్స్ ఫుల్ మూవీ పేరిట లింక్ ను మీకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ లకు సందేశాలు పంపుతున్నారు. నిజంగానే ఫుల్ మూవీ ఉందేమోనని ఆ లింక్ ను  చాలా మంది క్లిక్ చేస్తున్నారు. ఆ తర్వాత వారి ఫోన్ పే, పేటీఎం ఖాతాల నుంచి నగదు మాయమవుతోంది.

ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి దేశమంతటా చర్చ జరుగుతోంది. వివేక్ రంజన్ అగ్ని హోత్రి తెరకెక్కించిన ఈ మూవీ చాలా అద్భుతంగా ఉందని ప్రశంసలు కురుస్తున్నాయి.  ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా కూడా సినిమాను  మెచ్చుకున్నారు. కాశ్మీర్ లో పండిట్ల ఊచకోతను కళ్లకు కట్టినట్లు చూపించారని.. వాటి నెత్తుటి చరిత్రను ప్రజల ముందుకు తీసుకొచ్చినందుకు అభినందనలు తెలిపారు.

తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ సైలెంట్ గా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. దేశం నలుమూలల నుంచి మంచి స్పందన వస్తోంది. అంతేకాదు.. కర్ణాటక, గుజరాత్, హర్యానా, యూపీ సహా పలు రాష్ట్రాలు కాశ్మీర్ ఫైల్స్ మూవీకి ట్యాక్స్ మినహాయింపునిచ్చాయి.

అయితే ఇప్పుడు ఈ మూవీ పేరిట మోసాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని ది కాశ్మీర్ ఫైల్స్ పేరిట జరిగిన ఓ సంచలన మోసం హాట్ టాపిక్ గా మారింది. కాశ్మీరీ హిందువులకు విరాళా పేరిట ఫోన్ కాల్స్ చేసి బ్యాంక్ వివరాలను సేకరించి.. ఖాతాల్లో డబ్బులను ఊడ్చేస్తున్నారు. ఢిల్లీలో ఇలాంటి కేసులు మూడు నమోదయ్యాయి. కాశ్మీర్ ఫైల్స్ పేరుతో ఈ ప్రాంతాల్లో ఇప్పటివరకూ రూ.47 లక్షల మోసం జరిగిందని పోలీసులు గుర్తించారు. సైబర్ హ్యాకర్లు సీఈవో ర్యాంక్ అధికారినే బురిడీ కొట్టించి ఆయన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కొళ్లగొట్టారు.

సైబర్ నేరస్థులు కాశ్మీరీ హిందువుల కోసం విరాళాలు ఇవ్వాలని ఫోన్ చేస్తారు. రూ.100, లేదా రూ.200 విరాళం ఇస్తే చాలని ఆన్ లైన్ లో డబ్బులు పంపించాలని అడుగుతారు. ఎవరైనా డబ్బులు పంపారో ఇక వారి బ్యాంక్ ఖాతా వివరాలను హ్యాక్ చేసి డబ్బులు దోచుకుంటున్నారు.
Tags:    

Similar News