రాముడి పై అనుచిత వ్యాఖ్యలు...క‌త్తి మ‌హేష్ అరెస్ట్‌!

Update: 2020-08-14 08:30 GMT
టాలీవుడ్ వివాదాస్పద సినీ క్రిటిక్  కత్తి మహేష్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. కత్తి మహేష్ ను తాజగా  హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరాముడి పై  ఫేస్ బుక్ ‌లో అసభ్యకర  కామెంట్స్ చేశారంటూ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదులు అందాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న్ను అరెస్ట్ చేసిన పోలీసులు , ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. కాగా, కొన్ని నెలల క్రితం ఫేస్‌ బుక్, ట్విటర్‌ లో శ్రీరాముడి గురించి అసభ్యకర పోస్ట్‌లు పెట్టారు కత్తి మహేష్. ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన హిందూ సంఘాలు పలు చోట్ల కేసులు పెట్టాయి.  ఆ ఫిర్యాదుల ఆధారంగా సైబర్  క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. ఈ కేసు పై  పలుమార్లు కత్తి మహేష్‌ ను విచారించారు.  ఈ రోజు  మరోసారి విచారించిన పోలీసులు.. ఆ  విచారణ అనంతరం అరెస్ట్ చేశారు.

ఇకపోతే , గత కొన్నిరోజులుగా కొత్తి మహేష్ ఎదో ఒక విధంగా వార్తల్లో ఉంటున్నారు. పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్  కు టార్గెట్ గా మారి అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. అలా పవన్ ఫ్యాన్స్, కత్తి మహేష్ మధ్య కొన్ని నెలల పాటు మాటల యుద్ధం జరిగింది. ఆయనపై హైదరాబాద్‌లో ఓసారి దాడి కూడా జరిగింది. అలాగే , గ‌తంలో కూడా క‌త్తి మహేశ్ దేవుళ్ల ‌పై చేసిన వ్యాఖ్య‌లు..సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.
Tags:    

Similar News