శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కత్తి మహేష్ పై హిందూ జనశక్తి నేతలు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తమ మనోభావాలు దెబ్బతినేలా మహేష్ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వారు కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో, కత్తి మహేష్ ను పోలీసులు అరెస్టు చేయబోతున్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో గత రాత్రి కత్తి మహేష్ ....బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. విచారణలో భాగంగా మహేష్ ను పోలీసులు కొన్ని ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కత్తి మహేష్ ను పోలీసులు అక్కడ నుంచి పంపించివేశారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని నోటీసులు ఇచ్చారు. ఇదే విషయాన్ని కత్తి మహేష్ ధృవీకరిస్తూ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి తనను కొన్ని వివరాలు అడిగారని...వాటికి తాను సమాధానమిచ్చానని మహేష్ చెప్పారు. ఆ కేసుకు సంబంధించి కొన్ని విషయాలపై వివరణ కోరుతూ నోటీస్ ఇచ్చారని - ఇన్వెస్టిగేషన్ కి సహకరించమని కూడా నోటీస్ లో ఉందని మహేష్ పేర్కొన్నారు. ఇకపైన మిగతా విషయాలు చూడాలని మహేష్ అన్నారు. దాంతోపాటు - రామాయణం - యుద్ధకాండలో సీతనుద్దేశించి రాముడు వ్యాఖ్యానించినట్టుగా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనువదించిన కొన్ని వాక్యాలను తన ఫేస్ బుక్ ఖాతాలో మహేష్ పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
“సద్వంశంలో పుట్టినవాడు పౌరుశవంతుడయితే - పరగృహంలో ఉండిన భార్యను ఆనందంతో ఎవడు స్వీకరించగలడు. ఇంత కాలానికి నువ్వు రావణుని ఓడిలోనుండి దిగివచ్చావు. వాడు నిన్ను దుశ్చింతతో చూసాడు. ఇక నా కులం పాడుచేసుకుని నిన్నెలా స్వీకరిస్తాను? పోయిన కీర్తి మళ్లీ తెచ్చుకోవడానికి నిన్ను సాధించాను. నాకు నీయెడల ఆసక్తి లేశమూ లేదు.యథేచ్ఛగా వెళ్లిపో. ఇది నేను దృఢ నిశ్చయంతో చెప్పినమాట కానీ వేళాకోళం కాదు. కనుక లక్ష్మణుని దగ్గరకో - భరతుని దగ్గరకో - వానరేంద్రుడైన సుగ్రీవుని దగ్గరకో - రాక్షసేన్ ద్రుడయిన విభీషణుని దగ్గరకో వెళ్లి కాలం గడుపుకో. నువ్వు చక్కని దానవు. నాగరికత కలదానవు. వంట ఇల్లు జొచ్చిన కుందేలులాగా తన ఇంటో ఉన్నదానవు. సహజంగా దుష్టుడయిన రావణుడు నిన్ను విడిచిపెట్టి ఉండడు” అని చాలా కఠినంగా చెప్పాడు. లాలనపాలనలు ఎదురుచూస్తూ ఉన్న సీత ఇది విని ఏనుగు చేతచిక్కిన సల్లకీలతలాగా వడవడ వొణికిపోతూ కన్నీరు విడిచింది” అని ‘మనసు ఫౌండేషన్’ ప్రచురించిన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి సర్వలభ్య రచనల సంకలనం మూడవ సంపుటంలోని వాక్యాలను కోట్ చేశాడు. ఆపై “సీతను రావణుని దగ్గరకే తిరిగి వెళ్ళిపొమ్మన్నది సాక్షాత్తు సీత భర్తయిన శ్రీరాముడే. ఆ తరువాతే మణిరత్నం అయినా - బాబు గోగినేని అయినా లేదా నేనైనా అన్నది” అని మహేష్ పోస్ట్ పెట్టారు. తనను తాను సమర్థించుకునే క్రమంలోనే మహేష్ ఈ పోస్టు పెట్టినట్లు నెజిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.