క‌త్తి పంచ్:హీరోలంతా టీడీపీ వాళ్లేగా..ఇప్పుడు గుర్తుకు వ‌చ్చిందా

Update: 2018-03-20 15:34 GMT

రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై అన్ని వర్గాలు పోరాడుతుంటే ఒక్క సినీ పరిశ్రమ మాత్రం మౌనంగా ఉండటం స‌రికాద‌ని పేర్కొంటూ టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జల్లికట్టును నిషేధిస్తే తమిళ ఇండస్ట్రీ మొత్తం కదిలొచ్చి ఉద్యమించిందని కానీ టాలీవుడ్‌ హీరోలకు హీరోయిన్ల అందాలను వర్ణించడం తప్పా హక్కుల కోసం పోరాటం చేయరా అంటూ మండిపడ్డారు. అవార్డులు రాకపోతే రచ్చరచ్చ చేసే హీరోలు ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని - బానిస బతుకులు ఇంకెన్నాళ్లని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఇకనైనా ఆంధ్రుల హక్కుల కోసం నడుం బిగించాలని, లేకపోతే తెలుగు సినీ పరిశ్రమను బహిష్కరిస్తామని రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. అయితే ఈ కామెంట్ల‌పై సినీ విమ‌ర్శ‌కుడు క‌త్తిమ‌హేశ్ ఘాటుగా స్పందించారు.

ఈరోజు తెలుగుదేశం ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ గారికి తెలుగు హీరోలు గుర్తొచ్చారు అంటూ క‌త్తి మ‌హేశ్ త‌న‌దైన శైలిలో కౌంట‌ర్ ఇచ్చారు. `ఉన్న హీరోలందరూ ఎదో ఒక రకంగా మీ పార్టీకి సంబంధించిన వాళ్లేగా! బాలకృష్ణ ఒకరు చాలడా?అవార్డులు పంచుకున్న బ్యాచ్చి ఎక్కడ? మీరు వైజాగ్ లో భూములు ఇచ్చిన స్టార్లు ఎక్కడ?బొడ్డు - జఘనాల డైరెక్టర్ తిరుమలలోనే ఉన్నారుగా?బోయపాటి శీను ఎక్కడా? శివాజీ - పవన్ కళ్యాణ్ - నిఖిల్ సిద్దార్థ - సంపూర్ణేష్ బాబు - తమ్మారెడ్డి భరద్వాజ - మంచు మనోజ్ - కొరటాల శివ -నేను ఆల్రెడీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడాము. ఉద్యమాలలో పోరాడాము. నిన్నటికి నిన్న కళ్ళు తెరిచి హోదారాగం ఎత్తుకున్న టీడీపీ నాయకులు కళ్ళు నెత్తికెక్కినట్టు ఉన్నాయి. మాటలు జాగ్రత్త!` అంటూ ఘాటుగా స్ప‌ష్ట‌మైన వ్యాఖ్య‌లు చేశారు.

కాగా, టీడీపీ ఎమ్మెల్సీకి క‌త్తి మ‌హేశ్ కౌంట‌ర్‌ పై సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు వెంట‌నే స్పందించారు. `హమ్మయ్య  ఇప్పటికైనా నా పేరును & నేను చేసిన  పోరాటాలను గుర్తించి నందుకు  ధన్యున్ని  _ కత్తి కి రెండు వైపుల  పదును ఉంది అని  రుజువు చేశావు` అంటూ త‌మ్మారెడ్డి భ‌రద్వాజ రియాక్ట‌య్యారు.
Tags:    

Similar News