ప‌వ‌న్‌ ను మ‌ళ్లీ కెలికిన క‌త్తి మ‌హేశ్‌

Update: 2017-12-09 11:16 GMT
జ‌న‌సేన పార్టీ అదినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ను సినీ విమ‌ర్శ‌కుడు క‌త్తి మ‌హేష్‌ నీడ‌లా వెంటాడుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ప‌వ‌న్ చేసే ప‌ప్ర‌తి ప‌నిపై విమ‌ర్శ‌లు చేస్తున్న క‌త్తి మ‌హేష్‌ తాజాగా ప‌వ‌న్ బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన ఉదంతం పై కూడా మ‌హేశ్ మండిప‌డ్డారు. అయితే క‌త్తి విమ‌ర్శ‌లు నిజంగానే క‌త్తి గ‌ట్టిన‌ట్లు ఉన్నాయ‌ని ప‌లువురు అంటుండ‌గా...ఆయ‌న చేసిన దాంట్లో లాజిక్ ఉంద‌ని కొంద‌రు అంటున్నారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే...ప‌వ‌న్‌ పై మ‌ళ్లీ క‌త్తి మ‌హేష్‌ మండిప‌డ్డారు. అదే స‌మ‌యంలో త‌న‌పై న‌మోదైన కేసు విష‌యంలో కూల్‌ గా మ‌హేష్ రియాక్ట‌య్యారు.

ఇటీవ‌లి కాలంలో జ‌న‌సేన పార్టీ పై, ప‌వ‌న్‌ పై మ‌హేష్ క‌త్తి విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇదే రీతిలో ప‌వ‌న్‌ పై తాజాగా మరిన్ని కామెంట్లు చేశారు. కొద్దికాలం క్రితం విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ప్ర‌మాద బాధితుల‌ను శ‌నివారం పవ‌న్ పరామ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మంత్రి అఖిల‌ప్రియ తీరును ప‌వ‌న్ త‌ప్పుప‌ట్టారు. అయితే ముఖ్య‌మంత్రిని ఎందుకు ప్ర‌శ్నించ‌ర‌ని క‌త్తి మ‌హేష్ నిల‌దీశారు. `ఎక్కడో రైలు దుర్ఘటన జరిగితే లాల్ బహుదూర్ శాస్త్రి రాజీనామా చేశారని, ఇలా అయితే చంద్రబాబు ఎన్ని సార్లు రాజీనామ చెయ్యాలో... ప్ర‌శ్నిస్తాన‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌...ఒకసారైనా రిజైన్ చెయ్యమని కోరకూడదా?` అంటూ వెట‌కారంతో కూడిన ప్ర‌శ్నను ప‌వ‌న్‌కు సంధించారు.

ఇదిలాఉండ‌గా...ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పై కూడా...మ‌హేష్ క‌త్తి రియాక్ట‌య్యారు. కేంద్ర‌మాజీ మంత్రి మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్ చేసిన `నీచ్ ఆద్మీ` కామెంట్ల పై ప్ర‌ధాని రియాక్ష‌న్‌ను త‌ప్పుప‌ట్టారు. ఇటు అయ్య‌ర్‌ను అటు మోడీ తీరును ఖండించారు. `మణిశంకర్‌ది బాధ్యత లేని వాగుడు...మోడీది బాధ్యత మరిచిన సణుగుడు` అంటూ ఎట‌కారం ఆడారు.

మ‌రోవైపు త‌న ట్వీట్ ఆధారంగా బీజేపీ ఎమ్మెల్యే రియాక్ట‌యిన ఉదంతం పై కూడా క‌త్తి మ‌హేష్ కూల్ రిప్లై ఇచ్చారు. `ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ లాంటి న‌రహంత‌కులకు స‌పోర్ట్ ఇచ్చిన నిన్ను.. మ‌తోన్మాదుల‌తో చెయ్యి క‌లపొద్దు అని చెప్పిన నీ అభిమాని నీకు చెడ్డోడులా క‌నిపించాడా? మోడీ ప్ర‌ధాని అయినంత మాత్రానా ఏం చేసినా రైట్ అయిపోతుందా?.. నీ ఉన్నాదం ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతూనే ఉంది` అని మ‌హేష్ క‌త్తి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ‌డం దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కంప్లైంట్ చేయ‌డం... హైద‌రాబాద్‌ పోలీసులు స్పందించి ప‌రిశీలిస్తాం అని తెల‌ప‌డం..ఇలా వ‌రుస‌గా సాగిన ప‌రిణామాల‌పై మ‌హేష్ క‌త్తి తాపీగా స్పందించారు. ` నాకు చట్టాల గురించి బాగా తెలుసు. చట్టం తెలియని ఒక ఎమ్మెల్యే నా మీద ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసినంత మాత్రాన ఏమీ కాదు. ఎవరూ కంగారు పడవద్దు. ఆ ఫిర్యాదు చెల్లదు. అది అసలు కేసే కాదు` అంటూ పోస్ట్ పెట్టారు.

Tags:    

Similar News