ఎజెండా క్లియర్. ఏ చిన్న ఛాన్స్ చిక్కినా పవన్ ను ఏసుకోవటమే ధ్యేయంగా పెట్టుకున్న కత్తి మహేశ్ మరోసారి చెలరేగిపోయారు. సినీ విమర్శకుడన్న ట్యాగ్ తో ఫేస్ బుక్ వాల్ మీద పరిచయం చేసుకున్న ఆయన.. తరచూ పోస్టింగులు పెడుతూ గడిచిన కొన్నేళ్లుగా తనకు తానే సెలబ్రిటీగా కామెంట్లు పెట్టేస్తున్నారు. ఫేస్ బుక్ బలాన్ని అర్థం చేసుకున్న తొలితరం వ్యక్తులుగా కత్తి మహేశ్ ను చెప్పాలి
సోషల్ మీడియా అసరాతో తన ఇమేజ్‌ను పెంచుకున్న ఆయన.. బిగ్ బాస్ తెలుగు వెర్షన్ లో సీజన్ వన్ లో ఎంట్రీ ఇవ్వటం ద్వారా అధికారికంగా సెలబ్రిటీ హోదాను పొందేశారు. అమ్మ అంటే ఇష్టం. అవకాయ అంటే మరింత ఇష్టం అని చెప్పే మాదిరి.. పవన్ అంటే ఏ మాత్రం నచ్చని కత్తి మహేశ్ తరచూ ఏదో ఒక పోస్ట్ పెడుతుంటారు.
మిగిలిన సిని హీరోలతో పోలిస్తే.. పవన్ ఫ్యాన్స్ ఇట్టే స్పందిస్తుంటారు. తమ అభిమాన నటుడి మీద ఈగ కూడా వాలకుండా చూసుకోవాలన్న అత్యాశ కనిపిస్తుంది. ఇవాళ.. రేపు సోషల్ మీడియా చెలరేగిపోతున్న వేళ.. ఎవరు.. ఏమైనా అనే అవకాశం ఉన్నప్పుడు అనకుండా ఊరుకుంటారా?
అయినప్పటికీ పవన్ ఫ్యాన్స్ ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా రియాక్ట్ అవుతుంటారు. అదే.. కత్తి మహేశ్ లాంటి వారికో వరంగా మారింది. పవన్ మీద ఆయన చేసే విమర్శలకు.. పవన్ ఫ్యాన్స్ స్పందిస్తున్న పుణ్యమా అని.. సోషల్ మీడియాను దాటేసి మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి ఎంటర్ అయిపోయారు. కత్తి చేసే విమర్శల్ని పలు ఛానళ్లలో అరగంట.. గంట లైవుల్ని పెట్టేసి.. కత్తిని పిలిచేసి చర్చలు చేసేస్తున్న వైనం కనిపిస్తూనే ఉంది.
తనకొచ్చిన ఇమేజ్ ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు కత్తి మహేశ్. పవన్ మీద ఏ చిన్న అవకాశం వచ్చినా ఎటకారంతో చెలరేగిపోయే ఆయన.. తాజాగా పవన్ పై మరింత ఎటకారం కత్తిని దూశారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పి.. తమిళనాడు రాష్ట్రంలోని 234 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించటం తెలిసిందే. డబ్బు కోసమో.. పదవి కోసమో రాజకీయాల్లోకి రావటం లేదు.. ప్రజలకు రక్షణ కల్పించేందుకే వస్తున్నా.. యుద్ధం చేస్తా.. గెలుపోటములు దేవుడి దయ.. యుద్ధం చేయకుంటే పిరికివాడంటారు అంటూ రజనీ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.
రజనీ స్పీచ్‌లో కత్తి మహేశ్ తనకు కావాల్సిన పాయింట్ ను సెలెక్ట్ చేసుకున్నారు.దాన్ని తనకు తగ్గట్లుగా మార్చుకొని.. రజనీ వ్యాఖ్యతో పవన్ పై వ్యంగ్యాస్త్రంగా సంధించటం గమనార్హం. పార్టీ పెట్టి పోటీ చేయకుండా ఇంట్లో కూర్చుంటే పిరికిపంద అంటారు అంటూ హీరో రజనీ కామెంట్ ను పెట్టిన మహేశ్.. అరే.. మా స్టేట్ లో పవన్ కల్యాణ్ అంటామే! అంటూ ఎటకారం చేసేసుకున్నారు. చిన్న దానికే చెలరేగిపోయే పవన్ ఫ్యాన్స్ కు.. తాజాగా కత్తి చేసిన వ్యాఖ్య మరింత మంట పుట్టటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్గమవుతోంది.