ప‌వ‌న్‌ ను క‌త్తి మ‌ళ్లీ గెలికాడు!

Update: 2018-12-02 08:07 GMT
సినీ విమ‌ర్శ‌కుడు క‌త్తి మ‌హేశ్ ట్వీట్లు - టీవీ చ‌ర్చ‌ల్లో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు కొన్ని నెల‌ల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత‌టి దుమారం రేపాయో అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా క‌త్తి మ‌హేశ్‌ కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌ కు మ‌ధ్య గ‌ట్టి వార్ న‌డిచింది. అయితే - హిందువుల ఆరాధ్య దైవం శ్రీ‌రాముడిపై క‌త్తి అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంతో ప‌రిస్థితి ఒక్క‌సారిగా మారిపోయింది. విద్వేషాలు రెచ్చ‌గొడుతున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై క‌త్తికి హైద‌రాబాద్ పోలీసులు న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ విధించారు. దీంతో అత‌డు తెలుగు రాష్ట్రాల‌కు దూరంగా మ‌కాం మార్చాడు. ఫ‌లితంగా దుమారానికి కాస్త తెర‌ప‌డింది.

అయితే - తాజాగా క‌త్తి మ‌హేశ్ మ‌రోసారి ప‌వ‌న్‌ ను గెలికాడు. త‌మ మ‌ధ్య న‌డుస్తున్న వార్‌ కు కాస్త గ్యాప్ వ‌చ్చిందే త‌ప్ప అది ఇంకా పూర్త‌వ‌లేద‌ని సంకేతాలిచ్చాడు. ప‌వ‌న్‌ను విమ‌ర్శిస్తూ ఓ ట్వీట్ చేశాడు. దానిపై ప‌వ‌న్ అభిమానులూ మ‌ళ్లీ రెచ్చిపోతున్నారు. దీంతో మ‌ళ్లీ తెలుగు రాష్ట్రాల్లో క‌త్తి గోల మొద‌లైంద‌ని ప‌లువురు చెప్పుకుంటున్నారు.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ఇటీవ‌ల పిఠాపురంలో ప‌వ‌న్ ప‌ర్య‌టించారు. ఓ స‌భ‌లో ప్ర‌సంగించారు. స‌భ‌కు వ‌చ్చిన‌వారంతా సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో ప‌వ‌న్ స్పందిస్తూ.. శ్రీ‌పాద వ‌ల్ల‌భుడి ఆశీర్వాదం ఉంటే తాను త‌ప్ప‌కుండ సీఎం అవుతాన‌ని వ్యాఖ్యానించారు. త‌ద్వారా త‌న అభిమానులు - పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహం నింపారు.

తాజాగా ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై ట్విట‌ర్‌ లో క‌త్తి మ‌హేశ్ స్పందించాడు. జ‌నం అరిస్తే - దేవుడు ద‌య త‌లిస్తే హిట్ట‌వ్వ‌డానికి ఇదేమైనా సినిమా అనుకుంటున్నావా ప‌వ‌న్ అంటూ ఎద్దేవా చేశాడు. సినిమాకైతే క‌థ బాగుండాల‌ని, దాన్ని బాగా తెర‌కెక్కించ‌గ‌ల‌గాల‌ని సూచించారు. రాజ‌కీయాల్లో అయితే నువ్వేంటో తెలియాలి. గెలిస్తే ఏం చేస్తావో చెప్పాలి. ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌గ‌ల‌న‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించాలి. నీ త‌ర‌ఫున నిల‌బ‌డిన‌వాళ్లు మెజారిటీ స్థానాలు గెల్చుకోవాలి. అప్పుడే నువ్వు సీఎం అవుతావ్. తెలుసుకో ప‌వ‌న్ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. క‌త్తి ట్వీట్‌ పై జ‌నసేన కార్య‌క‌ర్త‌లు - ప‌వ‌న్ ఫ్యాన్స్ దీటుగా స్పందిస్తున్నారు. క‌త్తిపై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. మొత్తానికి తెలుగునాట మ‌ళ్లీ క‌త్తి గోల మొద‌లైంద‌న్న‌మాట‌!

   

Tags:    

Similar News