కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కేసీఆర్ బఫూన్ అనడంతోనే కాంగ్రెస్ నేతలు ఏడుస్తుంటే.. ఆయన అన్న మాటలను సమర్థించి ఎంపీ కవిత మరోసారి ఆ గాయాన్ని రేపారు. దిల్లీలోని తెలంగాణ భవన్ లో ఎంపీల మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత.. అసలు బఫూన్ అంటే ఏమిటి.. ఎందుకు రాహుల్ గాంధీని బఫూన్ అన్నారో కూడా వివరించారు. రాహుల్ గాంధీని బఫూన్ అనడంలో తప్పేమీ లేదని ఆమె అన్నారు. ఎవ్వరైనా తెలివి తక్కువ పనులు చేస్తే వారిని బఫూనే అంటారని వివరించారు. దేశం మొత్తం చూస్తుండగా - పార్లమెంట్ లో సభ్యులందరి ముందు ప్రధానమంత్రి మోదీని కౌగిలించుకోవడం చూసినవారెవరైనా అదెంతో సిల్లీ పనో చెబుతారన్నారు. పార్లమెంటులో ఆయన చేసే తింగరి పనులను దేశమంతా చూసిందని.. అలాంటి వెర్రి పనులు చేసే వారిని బఫూన్ అనకపోతే ఇంకేమంటామని ప్రశ్నించారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికలపై మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ దారుణంగా విఫలమైందని.. మధ్యప్రదేశ్ లో అతి కష్టమ్మీద బీఎస్పీ సపోర్టుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని.. రాజస్తాన్ లో సంప్రదాయం ప్రకారం అధికారం మారిందని.. అంతేతప్ప ఇదేమీ కాంగ్రెస్ ఘనత కాదని అన్నారు. ఛత్తీస్ గఢ్ - మధ్యప్రదేశ్ - రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా బలమైన ప్రాంతీయ పార్టీలు ఉండి కాంగ్రెస్ కు ఏమాత్రం అవకాశం ఉండేదికాదన్నారు.
కాంగ్రెస్ - బీజేపీ లేకుండా ఫెడరల్ ఫ్రంట్ సాకారమవుతుందని - రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజల అవసరాలను గుర్తించేలా ఫెడరల్ ఫ్రంట్ ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని డీఎంకే నేత స్టాలిన్ భావి ప్రధానిగా వర్ణించడంపై స్పందిస్తూ.. కాంగ్రెస్ అనుకూల కూటమిలో లుకలుకలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాహుల్ ను ఒక పార్టీ సమర్థిస్తే, అదే కూటమిలోని రెండు ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకించాయన్నారు