ప్రతి దానికి టైమింగ్ చాలా కీలకం. రాజకీయ నేతలకు ఇది అత్యవసరం. ఈ విషయంలో ఏ మాత్రం తేడా కొట్టినా అభాసుపాలు కావటం ఖాయం. తాజాగా నిజామాబాద్ ఎంపీ కవిత చేసిన ట్వీట్లు ఆసక్తికరంగా మారాయి. కొంగరకలాన్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు సంబంధించిన ట్వీట్ లను వరుస పెట్టిన ట్వీట్ల రూపంలో కవిత పెట్టారు.
సభ ప్రారంభానికి ముందు నుంచి ఆమె పలు ట్వీట్లను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తూనే ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సభ పూర్తి అయ్యాక ఆమె చేసిన వీడియో ట్వీట్ లు.. కేటీఆర్ కు సభ క్రెడిట్ ను ఇచ్చేయటం ఆసక్తికరంగా మారింది. కొంగర సభ భారీగా విజయవంతం కావటానికి వీలుగా కీలకభూమిక పోషించింది కేటీఆర్ అని కవిత పేర్కొన్నారు. పది రోజుల నుంచి అహరహం శ్రమించి.. ఈ రోజు ఇంత భారీ బహిరంగ సభగా మారిందంటే.. దాని వెనుక తన సోదరుడు మంత్రి కేటీఆర్ ఎఫర్ట్ పెట్టారని పేర్కొన్నారు.
తన సోదరుడ్ని హైలెట్ చేయటం కోసం ఆయనకు అనుకూలంగా ట్వీట్లు చేయటం బాగానే ఉన్నా.. ఎంపీ కవిత టైమింగ్ అస్సలు బాగోలేదన్న మాట వినిపించింది. కొంగర కలాన్ కు మొదట్నించి చెబుతున్నట్లుగా పాతిక లక్షల మార్క్ మధ్యలో ఆగిపోవటాన్ని మర్చిపోకూడదు. జన సందోహంతో కొంగర కలాన్ కిక్కిరిసినట్లుగా కనిపించినప్పటికీ వాస్తవం మాత్రం మరోలా ఉందని పేర్కొన్నారు. దీనికి తోడు చప్పగా సాగిన కేసీఆర్ స్పీచ్ గులాబీ దళాల్ని మాత్రమే కాదు.. కేసీఆర్ మీద భారీగా అంచనాలు పెట్టుకున్న వారంతా నిరాశ చెందుతున్న పరిస్థితి.
ఇలాంటివేళ.. ఆశించినంతగా రాని సభను ఉద్దేశించి ఎంపీ కవిత పెట్టిన ట్వీట్ల టైమింగ్ ఏమాత్రం బాగోలేదన్న అభిప్రాయం పలువురి నోట వినిపిస్తోంది.