గ్రేటర్ లో గెలుపు పక్కా అయినా.. ఆ గెలుపు ఎలా ఉంటుందన్న కన్ఫ్యూజన్ గులాబీ దళానికి ఉందా? అంటే అవుననే చెబుతున్నాయి ఆ పార్టీ కీలక నేతల మాటలు వింటుంటే. గ్రేటర్ ఎన్నికలకు ముందు గ్రేటర్ పీఠం తమదేనని పక్కాగా చెప్పటంతో పాటు.. సీట్ల సాధన విషయంలో ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసిన తెలంగాణ అధికారపక్షం తాజాగా మాత్రం ఆచితూచి మాట్లాడుతుంది.
మొదట్లో వంద సీట్లు తమవే అన్నట్లుగా ప్రచారం చేసుకున్న టీఆర్ ఎస్ పార్టీ నేతలు.. ఇప్పుడు అంకెలు కాదు.. గెలుపు ఎవరిది? మేయర్ సీటులో ఎవరు కూర్చుంటారో? సవాళ్లు విసరుకుందామా? అని వ్యాఖ్యలు చేయటం విశేషం. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె.. నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ.. గ్రేటర్ లో ఎన్ని సీట్లు గెలుస్తామన్న అంకె అస్సలు ముఖ్యం కాదని.. గ్రేటర్ పీఠాన్ని ఎవరు సొంతం చేసుకుంటారు? మేయర్ కుర్చీలో ఏ పార్టీ నేత కూర్చుంటారన్నది మాత్రమే ముఖ్యమంటూ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
నిన్నమొన్నటి వరకూ వందకు సీట్లు తగ్గవంటూ వ్యాఖ్యలు చేసిన గులాబీ నేతలు.. ఇప్పుడు అందుకు భిన్నంగా మేయర్ కుర్సీ తమదేనని.. కాకుంటే ఎన్ని సీట్లు అన్న లెక్కల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పటం ఆసక్తికరంగా మారింది. మేయర్ పీఠం పక్కా తమదేనని చెబుతున్నంత కాన్ఫిడెంట్ గా.. సీట్ల లెక్కపై స్పష్టత ఇవ్వకపోవటమేమిటి అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పొచ్చు.