టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ కోట్లాది అభిమానులున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అయిన చిరంజీవికి కొంతమంది రాజకీయ నాయకులు కూడా అభిమానులే. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ కవిత కూడా చిరు ఫ్యానేనట. ఈ రోజు జరగుతున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సందర్భంగా చిరుతో సెల్ఫీ దిగిన కవిత ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఫ్యాన్ మూమెంట్...సెల్ఫీ విత్ మెగాస్టార్ డ్యూరింగ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ....అంటూ కవిత ఆ ఫొటోను ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి - టీఆర్ ఎస్ ఎంపీ కవిత ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా తన అభిమాన హీరో చిరంజీవితో ఎంపీ కవిత సెల్ఫీ దిగారు. అంతేగాక, సెల్ఫీ విత్ మెగాస్టార్ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఆ ఫొటోను పోస్టు చేశారు. తాను మెగాస్టార్‌కు అభిమానినంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ ఫొటో పెట్టిన కొద్దిసేపటికే వైరల్ అయింది. ఆ పోస్టుకు లైకులు, కామెంట్లు వెల్లువెత్తాయి. వస్తున్నాయి.
కాగా, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పోటీలో ఉండగా, విపక్షాల అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ బరిలో ఉన్న విషయం తెలిసిందే. మెజార్టీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వెంకయ్యనాయుడే ఉపరాష్ట్రపతిగా గెలుపొందే అవకాశాలున్నాయి. శనివారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు సభ్యులు తమ హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే, మధ్యాహ్నం 1 గంట వరకు 90.83 శాతం ఓటింగ్ నమోదయిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి(అసిస్టెంట్) ముకుల్ పాండే మీడియాకు తెలిపారు. సాయంత్రం 7 గంటలకు ఉప రాష్ట్రపతి ఎన్నిక ఫలితం వెలువడనుంది.