ముందుస్తు ఖాయమైంది...తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. అధికార, ప్రతిపక్షపార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఎవరికి వారే అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీ ముందుగా యాభైమంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించాలనుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా సెప్టెంబర్ 2న జరిగే ప్రగతి నివేదన సభలో 15 మంది అభ్యర్థులను ప్రకటించాలనుకుంటోంది. మహిళల ఓట్లే కీలకమైన తెలంగాణలో ఈ సారి తెలంగాణ రాష్ట్ర సమితి ఎంత మంది మహిళలకు సీట్లు ఇస్తుందనేది ఆసక్తికర చర్చగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు మహిళల పట్ల చులకన భావం ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే ప్రస్తుత మంత్రి వర్గంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. ఆరుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిస్తే వారిలో ఒక్కరికే డిప్యూటీ స్పీకర్ పదివిచ్చారు. మంత్రి పదవి కోసం ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కిం అనలేదు.