ఎవరికి ఎంత గౌరవం దక్కాలో కేసీఆర్ కు బాగా తెలుసు. ఆ క్రమంలో.. అవసరం అనుకుంటే తాను ఎంత తగ్గాలో కూడా ఆయనకు బాగానే అవగాహన ఉంటుంది. బెట్టు చూపించే విషయంలో తనకు మించిన వారు లేరన్నట్లు వ్యవహరించే కేసీఆర్.. తగ్గే విషయంలోనూ అంతే చూపిస్తారు. తన రహస్య మిత్రుడికి కేసీఆర్ ఇచ్చిన ప్రాధాన్యత మైనార్టీ వర్గాల్లో ముద్రించేలా ఆయన తాజాగా ఒక పని చేశారు.
తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్వహించిన ఇఫ్తార్ వేడుకుల్లో భాగంగా నిజాం మైదానంలో ఏర్పాటు చేయటం తెలిసిందే. ఈ వేడుకులకు హాజరైన ప్రముఖుల్లో మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు. ఆయన.. వేదికకు ఎదురుగా ఉన్న వరుసలోని కుర్చీలో కూర్చున్నారు. సాధారణంగా వేదిక మీద ఉండాల్సిన వారు.. అందుకు భిన్నంగా ఉంటే.. వారు వేదిక మీదకు రావాలని సాదరంగా ఆహ్వానిస్తారు.
అలా చేస్తే కేసీఆర్ ప్రత్యేకత ఏం ఉంటుంది? అందుకే ఆయన.. స్టేజ్ దిగి.. కిందకు వెళ్లి మరీ.. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీని వేదిక మీదకు తీసుకొచ్చారు. స్వయంగా ముఖ్యమంత్రే తనకు అంతటి గౌరవాన్ని ఇవ్వటాన్ని అసద్ సంగతి తర్వాత.. అక్కడకు హాజరైన వేలాది మైనార్టీలు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కేసీఆరా.. మజాకానా.