చంద్రుళ్ల అబ్సెంట్ తో గవర్నర్ మనమళ్ల అలక

Update: 2015-08-16 04:51 GMT
హోదాతోనే హక్కులు వచ్చేస్తుంటాయి. పంద్రాగస్టుకు.. జనవరి 26 నాడు.. గవర్నర్ నేతృత్వంలో ‘‘ఎట్ హోం’’ అనే కార్యక్రమం ధూంధాంగా సాగుతుంది. ఢిల్లీలో రాష్ట్రపతి.. రాష్ట్రాల్లో గవర్నర్ ఈ విందును ఏర్పాటు చేస్తారు. దీనికి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. మంత్రులు.. వివిధ రంగాల ప్రముఖులు హాజరవుతుంటారు.

రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ అయిన నరసింహన్.. యథావిధిగా ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారని భావించారు. ఒకవేల.. ఇద్దరూ రాకున్నా ఎవరో ఒకరు వస్తారని భావించారు. కానీ.. వారిద్దరూ ఈసారి డుమ్మా కొట్టారు. వారి అబ్సెంట్ కి కారణం బయటకు రాకున్నా.. వారి గైర్హాజరీలోనూ నరసింహన్ బండి నడిపించేశారు.

తాను నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి ఇద్దరు ముఖ్యమంత్రులు రాకపోవటంపై గవర్నర్ ఫీల్ అయినా కాకున్నా.. ఆయన మనమడు.. మనరాలు మాత్రం ఫీలయ్యారట. రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులైన ఇద్దరితో ఫోటోలు దిగాలని తెగ ఉత్సాహపడ్డారట. కానీ.. వారిద్దరి గైర్హాజరీతో వారు కాస్తా నిరుత్సాహపడ్డారట.

గవర్నర్ మనవళ్లు మాత్రమే కాదు.. రెండు రాష్ట్రాలు పచ్చగా.. కళకళలాడుతూ.. ఎలాంటి వివాదాలు లేకుండా స్నేహపూర్వకంగా ఉండదలని భావించే ప్రతి ఒక్క తెలుగువాడు సైతం చంద్రుళ్లు గైర్హాజరీకి ఫీలవుతున్న వాళ్లే. కాకపోతే.. గవర్నర్ మనమళ్ల ఫీల్సింగ్ కి మీడియాలో వార్తల రూపంలో వచ్చేస్తాయి మరి. స్థాయిని బట్టే ఫీలింగ్స్ కు ప్రాధాన్యత మరి.
Tags:    

Similar News