వందలాది కోట్లు ఖర్చు పెట్టి పుష్కరాల్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పే రెండు తెలుగు ప్రభుత్వాలు.. లక్షలాదిగా వచ్చే యాత్రికుల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతుంటాయి. అయితే.. మాటల్లో కనిపించిన ‘జాగ్రత్త’ చేతల్లో అస్సలు కనిపించదు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వాలు చెబుతుంటాయి. ఘాట్లు ఏర్పాటు చేయటం.. పోలీసుల్ని పహరా.. రవాణా సదుపాయం.. ప్రమాదాలు చోటు చేసుకోకుండా చూడటంతో పాటు.. పుష్కరాల కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి.
పుష్కరాలకు వచ్చే భక్తులు వీలైనంతవరకూ ఆర్థికంగా భారం పడకుండా ప్రభుత్వం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. కానీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పుష్కరాల్లో ఈ విషయాన్ని ప్రభుత్వాలు పట్టించుకున్నట్లుగా కనిపించదు. చూసేందుకు చిన్న విషయమే అయినా.. యాత్రికుల మీద పడే ప్రభావం ఎంత ఎక్కువగా ఉంటుందన్న అంశానికి ఉదాహరణగా కొబ్బరికాయల వ్యవహారాన్నే చూద్దాం. పుష్కర ఘాట్ల దగ్గర ఒక్కో కొబ్బరికాయను రూ.30 చొప్పున అమ్ముతున్నారు.
ఇంత భారీ ధరకు అమ్ముతున్న కొబ్బరికాయ ధర.. అంబాజీపేట హోల్ సేల్ మార్కెట్లో ఒక్కొక్కటి రూ.3 మించి పలకదు. పుష్కరాలకు పది రోజుల ముందు అయితే..ఒక్కో కాయ రూ.2 మాత్రమే పలికింది. అయితే.. పుష్కరఘాట్ల దగ్గర కొబ్బరికాయల కాంట్రాక్టు సొంతం చేసుకున్న వారు ఒక్కో కొబ్బరికాయను ఏకంగా రూ.30లకు అమ్మటం ప్రతిఒక్కరూ మండిపడుతున్నారు. అదేమైనా అంటే.. పెద్ద ఎత్తున ప్రభుత్వానికి సొమ్ములు చెల్లించామంటూ చెప్పటం కనిపిస్తుంది.
నిజానికి ఈ కొబ్బరికాయ స్టాళ్ల వల్ల వచ్చే ఆదాయం ప్రభుత్వానికి ఒక మూలకు రాదు. పుష్కరాల కోసం పెట్టే ఖర్చుతో పోల్చినప్పుడు కొబ్బరికాయల స్టాల్ పెట్టుకోవటానికి వారు ప్రభుత్వానికి ఇచ్చే సొమ్ము చిన్న రేణువు మాత్రమే. వాస్తవానికి ఇద్దరు చంద్రుళ్లకు ఐడియా రాలేదేమో కానీ.. ప్రభుత్వమే స్టాళ్లను ఏర్పాటు చేయటం.. లేదంటే.. స్టాళ్లను నామమాత్రపు ధరకు ఇచ్చేసి.. ఒక్కో కొబ్బరికాయ ఎంత అమ్మాలన్నది డిసైడ్ చేసి అమ్మిస్తే వారికెంతో పేరు వచ్చేది. కొబ్బరికాయల అమ్మకం మీద వచ్చే ఆదాయం మీద ప్రభుత్వం ఏమీ ఆధారపడి లేనందున.. కొబ్బరికాయ ధరను నామమాత్రపు ధరకు అమ్మిస్తే పుష్కరాలకు హాజరయ్యే యాత్రికుల సంతృప్తి పీక్స్ కు వెళ్లటం ఖాయం. ఒక్కో కొబ్బరికాయ బహిరంగ మార్కెట్లో రూ.20కు అమ్ముతున్నారు. హోల్ సేల్ మార్కెట్ లో దొరికే ధరకు కాయకు రూ.2 చొప్పున వేసి అమ్మినా..కొబ్బరికాయ ఒక్కొక్కటి రూ.5 అమ్మితే సరిపోతుంది. ఈ ధరకు కానీ కొబ్బరికాయను అమ్మితే.. ప్రభుత్వాలకు ఎంత పెద్ద మైలేజీ వస్తుందో మాటల్లో చెప్పలేరు.
పుష్కరాల సందర్భంగా యాత్రికులకు ప్రభుత్వాలు ఇస్తున్న ఆఫర్ గా కొబ్బరికాయల్ని నామమాత్రపు ధరకు విక్రయిస్తే.. భక్తులు నాలుగు కాలాల పాటు ఈ విషయాన్ని చెప్పుకోవటం గ్యారెంటీ. నిజానికి ఇలా చేయటం వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. రూ.3 కొనుగోలు చేసిన కొబ్బరికాయను రవాణా కింద రూపాయి వేసినా.. రూ.4 మించదు. ఒక్కో కొబ్బరికాయను రూ.6 లేదంటే రూ.7 అమ్ముతూ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటే.. ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కడూ పొగిడేటోడే. కానీ.. ఇలాంటి విషయాల మీద ఇద్దరు చంద్రుళ్లు దృష్టి పెట్టకపోవటం గమనార్హం. ఒక్క కొబ్బరికాయల విషయంలోనే కాదు.. పుష్కరాల దగ్గర అమ్మే ప్రతి సామాను విషయంలోనూ.. వస్తు సేవల విషయంలోనూ యాత్రికులను ధరలు ఎక్కువగా పెట్టి దోపిడీకి పాల్పటం మామూలైన నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యల ద్వారా యాత్రికుల జేబుకు చిల్లు పడకుండా అన్నీ చౌకగా లభించేలా చేస్తే.. కృష్ణా పుష్కర యాత్ర ఒక తీపి గురుతుగా మిగిలిపోవటం ఖాయం. కానీ.. ఇలాంటి ఐడియాలు ఇద్దరు చంద్రుళ్లకు రావటం లేదే.