ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తను చేసే ప్రతి పని తన పర్సనల్ ఇన్వాల్వ్ మెంట్ తో జరుగుతుందన్న విషయాన్ని చెప్పడం మానేస్తే మంచిదేమో! ఎందుచేతనంటే తను ఉంటే తప్ప రాష్ట్రంలో ఏ పనీ జరగదన్నట్లుగా ఆయన బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఆ మాటల వలన పరోక్షంగా ఆయన తాను లేకపోతే పని స్తంభించి పోయేలాగా వ్యవస్థని నిర్వీర్యం చేసేస్తున్నట్లుగా అర్థం వస్తుందని ఆయన గుర్తించడం లేదు. ఇప్పుడు జనం పొరుగున్న ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రతి విషయంలోనూ పోల్చి చూసుకుంటున్నారు. అక్కడ ఇంత హడావుడి - ఆర్భాటం లేకుండా ఇదే పనులు జరిగిపోతున్నాయి.. మరి ఇక్కడ చంద్రబాబు మాత్రం యావత్తు వ్యవహారాలు తన భుజాల మీద మాత్రమే నడుస్తున్నట్లుగా చెప్పుకోవడం ఏంటని విస్తుపోతున్నారు.
ఇంతకు మునుపు తెలుగు రాష్ట్రం ఒక్కటే వుండేది అప్పుడు వారు ఏం చెప్పినా చెల్లుబాటు అయ్యేది. కాని ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండు. ఇద్దరు ముఖ్యమంత్రులు. ఉదాహరణకి కృష్ణా పుష్కరాలు గురించి తీసుకుంటే పుష్కర ఘాట్ ల నిర్మాణల దగ్గర నుండి నిన్నటి హారతి వరకూ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. జనం గుమికూడిన ప్రదేశాలను ఆయన వదలిపెట్టడం లేదు. ఫుష్కరఘాట్ల నిర్మాణ పనులు సమయపరంగా జరగటం లేదని పనితీరు నాసి రకంగా వుందని సదరు కాంట్రాక్టర్ని తొలగించడం జరిగింది. ఇలాంటి చిన్న పనులకు కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి తన విలువైన సమయన్ని వెచ్చించి రావాలా?! మరి అధికారగణం ఎందుకు? లేక ప్రతిదీ తన ఘనతే అని చెప్పుకోవాలని ఉబలాటమా!
అదే పుష్కరాలని తెలంగాణ ముఖ్యమంత్రి అవసరమైన అదేశాలిస్తూ అధికారుల చేత అన్నీ పనులు చేయిస్తున్నాడు. ప్రారంభానికి ముందు సమీక్ష తప్ప.. రోజావారీ అధికార్లను వెంటపడడం కేసీఆర్ తీరులో కనిపించదు. కేవలం పూజలకు తప్పించి ఆయన ప్రత్యక్షంగా వెళ్లింది లేదు. కానీ పనులన్నీ చక్కగా జరిగిపోతున్నాయి. ఏపీలో మాదిరిగానే అక్కడ కూడా పుష్కరాలు వైభవంగానే జరుగుతున్నాయి. ప్రజలు ఈ వ్యతాసాన్ని గమనించి మాట్లాడుకుంటున్నారు.
చంద్రబాబు గారు అధికారులతో సమీక్షలు - టెలిఫోన్ కాన్ఫెరెన్స్ అని వాళ్ళని ఊదరగొట్టి మళ్ళీ అన్నింట్లో తను దూరి కనిపించడం ఎంతవరకూ సబబు. అధికారులు చేతకానివాళ్ళనుకోవాలా లేక బాబుగారి పబ్లిసిటి స్టంట్ అనుకోవాల.
పుష్కరాల పనుల సంభందించి ఇద్దరి ముఖ్యమంత్రుల పనితీరుని గమనించిన ప్రజలు 'స్మార్ట్' లీడర్ షిప్ కే లైక్ కొడుతున్నారు. అయినా హైటెక్ ముఖ్యమంత్రి గా తనను అందరూ కీర్తించాలని కోరుకునే చంద్రబాబు.. ఆధునిక తరానికి తగినట్లుగా ‘స్మార్ట్’ లీడర్ షిప్ అంటే.. అన్నింటిలోనూ తానే పనిచేయడం కాదని, అన్ని విభాగాలనూ సమర్థులతో పని చేయించడమే అని తెలుసుకోవాలి.