ముందస్తు ఎపిసోడ్ ఒక కొలిక్కి వచ్చింది. అందరి ఊహలకు తగ్గట్లు చేస్తే ఆయన కేసీఆర్ ఎందుకు అవుతారు. తన ప్రత్యేకతను మరోసారి నిరూపించుకున్నారు కేసీఆర్. ముందస్తు ఇష్యూలో ముందుగా వెలువడిన అంచనాలకు తగ్గట్లే జరిగాయి. అయితే.. ఎవరూ ఊహించనట్లుగా వ్యవహరించి అందరికి షాకిచ్చారు కేసీఆర్.
ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్.. అసెంబ్లీ రద్దు విషయాన్ని పెద్దగా ప్రస్తావించకుండానే.. తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసి ఆశ్చర్యానికి గురి చేశారు. నిజానికి అసెంబ్లీ రద్దు నేపథ్యంలో పెట్టిన ప్రెస్ మీట్ ను ఊహించనిరీతిలో ఇచ్చిన ట్విస్ట్ తో ఒక్కసారిగా సర్ ప్రైజ్ అయిన పరిస్థితి. తాజా పరిణామంతో విపక్ష పార్టీలు ఒక్కసారిగా డిఫెన్స్ లో పడిపోయేలా చేశారు.
గతంలో తాను చెప్పినట్లే నలుగురైదుగురికి తప్పించి మిగిలిన స్థానాలకు సిట్టింగ్ లకే టికెట్లు ఇస్తానని చెప్పానని.. అదే ప్రకారం 105 స్థానాల అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఇందులో ఇద్దరు మినహాయిస్తే మిగిలిన అందరికి సీట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. ముందస్తు ఎపిసోడ్ లో తనదైన ఫినిషింగ్ టచ్ గా అభ్యర్థుల జాబితా విడుదల తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సంచలనంగా మారిందని చెప్పాలి. మిగిలిన 14 మంది అభ్యర్థుల్ని సైతం వారంలో ప్రకటిస్తారని చెప్పాలి. తాజా పరిణామంతో విపక్ష పార్టీలు ఒక్కసారిగా డిఫెన్స్ లో పడ్డారని చెప్పాలి.