కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై తెలంగాణ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. దేశంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు తీసుకురావద్దని ఆయన హెచ్చరించారు. దేశంలో బీజేపీ అరాచకాలు పరాకాష్టకు చేరాయని అన్నారు. హైదరాబాద్ వచ్చిన ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులతో కలిసి సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్.. మోడీ తీరుపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తోందని మండిపడ్డారు.
తెలంగాణనే కాకుండా ఢిల్లీలోనూ ఆప్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో రెండు జాతీయ పార్టీలను మట్టికరిపించి కేజ్రీవాల్ అద్భుత విజయం సాధించారని కొనియాడారు. ఢిల్లీ ప్రజా ప్రభుత్వాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా వేధింపులకు గురి చేస్తున్నారని, కేంద్రప్రభుత్వ విధానాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టిందని చెప్పారు. ఎన్నికైన ప్రజాప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినా ఈ తీర్పును కూడా ధిక్కరిస్తూ కేంద్రం ఒక ఆర్డినెన్సు తేవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
సుప్రీంకోర్టు తీర్పునే అమలు చేయకపోతే.. మరి దేనికి విలువ ఉంటుందని కేసీఆర్ నిలదీశారు. అలంకారప్రాయమైన గవర్నర్ వ్యవస్థతో ఏదో చేయాలని మోడీ చూస్తున్నారంటూ పరోక్షంగా తమిళసై వ్యవహారాన్ని తీసుకువచ్చారు. కర్ణాటకలో ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టినా.. బీజేపీకి బుద్ధి రాలేదన్నారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించే బీజేపీ నేతలు కూడా ఇప్పుడు అదే చేస్తున్నారని చెప్పారు. ఇందిరా గాంధీ అమలు చేసిన ఎమర్జెన్సీ దిశగా కేంద్రంలోని బీజేపీ వెళ్తోందని కేసీఆర్ మండిపడ్డారు. బీజేపీకి ఢిల్లీ ప్రజలు మరోసారి తగిన బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా ఢిల్లీ ప్రజలను అవమానిస్తోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ విషయంలో కేంద్రప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్డినెన్సును కేంద్రం ఉపసంహరించుకునే వరకు పోరాడుతామన్నారు. ఇదిలావుంటే హైదరాబాద్ వచ్చిన తమకు కేసీఆర్ సాదరంగా ఆహ్వానం పలికారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ సర్కార్‌పై కేంద్రం వ్యవహరిస్తున్న తీరును కేసీఆర్‌తో చర్చించామని.. ఆయన తమకు మద్దతిస్తామని చెప్పారని అన్నారు. కేసీఆర్ జీ.. మోడీకి వ్యతిరేకంగా చాలా బలంగా పోరాడుతున్నారని తెలిపారు.