అవును మరి.. ఆయన ఒక హామీ ఇచ్చారు. సాధారణంగా ప్రభుత్వంలో పాలన పగ్గాలు చేతపట్టుకుని ఉన్న ఏ అధినేత కూడా ఇవ్వని హామీ అది! కానీ, ఆ హామీ సింపుల్ గా తుస్సుమనిపోయింది. మరో రకంగా చెప్పాలంటే.. ఆ హామీకి విలువలేకుండా పోయింది. అవును మరి.. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ లోజరిగిన పరిణామాలను గమనించిన ప్రతి ఒక్కరూ సమావేశాలకు ముందు కేసీఆర్ చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు గుర్తు చేసుకుని ముసిముసిగా నవ్వుకుంటున్నారు.
ఇంతకూ అంతగా నవ్వు తెప్పిస్తున్న ఆయన హామీ ఏంటా? అనుకుంటున్నారు కదా..! వివరాల్లోకి వెళితే.. అసెంబ్లీ మొదలు కావడానికి ముందు.. ప్రతిపక్షాల వారందరూ విడివిడిగా సమావేశాలు పెట్టుకుని.. వర్షాకాల సెషన్స్ ను 15రోజులు పెట్టాలని, 21 రోజులు పెట్టాలని ఇలా రకరకాలుగా ఎవరికి వారు డిమాండ్ లతో తీర్మానాలు చేసుకున్నారు. అయితే కేసీఆర్ ఏకంగా.. ప్రతిపక్షాలు ఎన్నిరోజులు కోరితే అన్ని రోజుల పాటూ సెషన్స్ నడపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని వెల్లడించారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన మొదటిరోజు జరిగిన బీఏసీ సమావేశంలో కూడా కేసీఆర్ ఇదేసంగతి చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ని రోజులు కోరుకుంటే.. అన్ని రోజులు సభ జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని అన్నారు. ఆ మాట ప్రకారం.. సభలు కనీసం 20 రోజులైనా జరుగుతాయేమో అని పలువరు అంచనా వేశారు.
అయితే ఇవాళ్టి పరిణామాల తర్వాత.. ఇక ఎన్నిరోజులు జరిపినా సరే... సర్కారుకు చీకూచింతా ఏమీ ఉండబోదని అనిపిస్తోంది. సభ ముగిసే వరకు తిరిగిలోనికి అడుగుపెట్టకుండా.. విపక్షాలకు చెందిన దాదాపు అందరూ సభ్యులనూ స్పీకరు సస్పెండ్ చేసేశారు. ఆ నేపథ్యంలో.. ఇక సభను సర్కారు వారు ఎన్నిరోజులు జరుపుకున్నా.. సరే వారి మాటకు ఎదురుచెప్పే వారు ఉండరని అర్థమైపోతోంది. సభలో వేటు పడకుండా మిగిలిన కాంగ్రెసు జానారెడ్డి , టీడీపీ ఆర్.కృష్ణయ్య, ఎంఐఎం సభ్యులు.. ఏదో ఏకపక్షంగా అంతా జరిగిపోయిందనే మాట రాకుండా.. విపక్షాల తరఫున బిల్లులపై తమ అభిప్రాయాలు వ్యక్తీకరించవచ్చు. వాటికి మన్నన దక్కుతుందని అనుకోనక్కరలేదు. పైగా వారు ప్రభుత్వాన్ని తిట్టిపోసే అలవాటు లేని నాయకులు. ఇక ఎర్రబెల్లి రేపు సభకు వచ్చి.. ఆవేశపడినా.. ఆయన మీద కూడా ఇవాళ మిస్సయిన వేటు రేపు పడిపోవచ్చు. మరి.. వ్యవహారాలు ఇలా నడుస్తోంటే.. జనానికి నవ్వు రాక మరేం వస్తుంది.