సెక్ర‌టేరియ‌ట్‌ పై మ‌ళ్లీ కేసీఆర్ మార్క్ ట్విస్ట్‌

Update: 2016-04-25 09:40 GMT
తెలంగాణ సెక్రటేరియట్‌ తరలింపు నిర్ణయం రెండు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెన‌క్కు అన్న‌ట్లుగా సాగుతోంది. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఈ నిర్ణ‌యం తాజాగా మ‌రోమలుపు తిరిగిన‌ట్లు స‌మాచారం. కొత్త‌ స‌చివాల‌య నిర్మాణంపై కేసీఆర్ వెన‌క్కి త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విజయవాడ నుంచి ప‌రిపాలన సాగిస్తోంది. ఇందులో భాగంగా కొన్ని శాఖల ప్రధాన కార్యాలయాలను ఇప్పటికే విజయవాడకు తరలించారు. ఏపీ ప్రభుత్వం తాజాగా వెలుగుపూడిలో తాత్కాలిక సెక్రటేరియట్‌ ను ప్రారంభించింది. దశల వారీగా 10వేల మంది ఉద్యోగులను తరలించేలా ఏర్పాట్లు చేస్తోంది. దీంతో నాలుగు బ్లాకులు ఖాళీ అవుతాయి. ఈ జూన్‌ నుంచి సచివాలయం మొత్తాన్ని అక్కడికి తరలించాలని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న చోటే పాలనను కొనసాగించేలా....పాత భవనాల స్థానంలో భారీ భవనాలు నిర్మించేందుకు ప్రణాళికను రచిస్తున్నారు.

ఏపీ వినియోగించుకుంటున్న భవనాలు ఖాళీ అయితే....వాటన్నింటిని తెలంగాణ ఉపయోగించుకునే అవకాశముంది. మంత్రులు - ముఖ్యకార్యదర్శులు - సెక్షన్‌ కార్యాలయాలకు సరిపడా చాంబర్లు - భవనాలను సర్దవచ్చని భావించిన కేసీఆర్ పున‌రాలోచించి సచివాలయాన్ని ఇక్కడే కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇదిలాఉండ‌గా గ‌తంలో కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణానికి ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రిలోని 48 ఎకరాల్లో సచివాలయం నిర్మించాలని కేసీఆర్ ప్ర‌భుత్వం భావించింది. అది వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో సికింద్రాబాద్‌ లోని బైసన్‌ పోలో స్థలాన్ని పరిశీలించిన సంగ‌తి తెలిసిందే. అయితే రక్షణ శాఖ నుంచి అనుమతి కుదిరే పనికాకపోవడంతో నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.
Tags:    

Similar News