ముఖ్యమంత్రి హోదాలోనే కాదు.. విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏదైనా కీలకమైన విషయాల మీద మాట్లాడాలనుకున్నా.. ముఖ్య ప్రకటన చేయాలనుకున్నా.. భారీ విజయం సాధించిన వేళలోనూ.. ఇలా ప్రతి సందర్భంలోనూ సోలో కంటే కూడా గ్రూపుగా ఉండి ప్రెస్ మీట్ పెట్టే అలవాటు కేసీఆర్ కు మొదట్నించి ఉంది. తనకు రెండు పక్కల భారీగా తన వర్గాన్ని కూర్చోబెట్టుకొని తాను చెప్పాలనుకున్నది చెప్పేస్తుంటారు కేసీఆర్. శనివారం రాత్రి వేళ కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్ సైతం ఇందుకు మినహాయింపు కాదు.
కాకుంటే.. రోటీన్ కు భిన్నంగా ఈసారి ప్రెస్ మీట్ లో ఒక కొత్త విషయం కనిపించిందన్న మాట వినిపిస్తోంది. సుదీర్ఘంగా సాగిన మంత్రివర్గ సమావేశం తర్వాత ఎంపిక చేసిన మంత్రులతో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారని చెప్పాలి. ఆర్థిక మంత్రి హరీశ్ లాంటి వారిని ప్రెస్ మీట్ కు దూరంగా ఉంచిన ఆయన.. సత్యవతి రాథోడ్.. గంగుల కమలాకర్.. ఈటల రాజేందర్.. అజయ్ కుమార్.. కొప్పుల ఈశ్వర్ లతో నిర్వహించారు.
విలేకరులు అడిగిన ప్రశ్నలకు సుదీర్ఘంగా సమాధానం ఇచ్చిన కేసీఆర్ కాస్త దూకుడుగా వ్యవహరించినట్లు చెప్పాలి. కేసీఆర్ మాట్లాడుతున్న వేళ.. ఒకట్రెండు సార్లు మాత్రం రవాణా శాఖా మంత్రి అజయ్ కుమార్ ముఖ్యమంత్రికి వివరాలు ఇచ్చారు. ఇది మినహాయిస్తే ఏ ఒక్కరు నోరు మెదపలేదు. సాధారణంగా ప్రెస్ మీట్ పెట్టే వేళలో..కేసీఆర్ పక్కన కూర్చున్న వారిలో ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తమ అధినేత చెప్పే మాటలకు తాము దన్నుగా ఉన్నట్లు వ్యవహరించేవారు.
అందుకు భిన్నంగా చుట్టూ ఉన్న మంత్రుల ముఖాలు పాలిపోయినట్లుగా ఉండటమే కాదు.. అందరూ గంభీరంగా ఉన్నట్లుగా కనిపించింది. ఏ సందర్భంలోనూ ముఖ్యమంత్రి చెప్పే మాటలకు ఉత్సాహంగా రియాక్ట్ అయ్యింది లేదు. కేసీఆర్ వేసిన సటైర్లకు విలేకరులంతా నవ్విన సమయంలోనూ మంత్రులు గంభీరంగా ఉండటం కనిపించింది. పేరుకు గ్రూపుగా ఉన్నప్పటికీ.. సారు మాత్రమే సోలోగా ఉన్నట్లు.. ఆయన చెబుతున్న మాటలకు మిగిలిన వారెవరూ అవును.. సీఎంసాబ్ చెబుతున్నది నిజమే అన్నట్లుగా వారి ముఖకవళికలు లేవన్నట్లుగా ఉంది. ఇలాంటి తీరు గతంలో ఎప్పుడూ లేవని చెబుతున్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్ వేళ మంత్రుల ముఖాల్లో ఉత్సాహం మిస్ అయ్యిందన్నట్లుగా ఉండటం గమనార్హం.