కళ్యాణమొచ్చినా కక్కొచ్చిన ఆగాల్సిందే.!

Update: 2020-03-15 05:07 GMT
కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు.. కానీ ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఆగాల్సిందేనంటూ రూల్స్ పెట్టారు. ఆగకపోతే కఠిన చర్యలు అంటూ హెచ్చరించారు. కరోనా భయంతో అత్యవసరంగా సమావేశమైన తెలంగాణ కేబినెట్ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, థియేటర్స్ కు సెలవులు ఇచ్చేసింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఇంతకంటే మించిన పని లేదని కేసీఆర్ తేల్చేశారు.

పనిలో పనిగా ఈనెల దాటితే తెలంగాణలో పెళ్లిళ్లను కూడా క్యాన్సల్ చేసేశారు కేసీఆర్. పెళ్లిళ్లు ఏర్పాటు చేస్తే జనాలు - పక్కాలు సహా చాలా మంది జనాలు బాగా గుమిగూడుతారు. దీంతో కరోనా వ్యాపించడానికి స్కోప్ ఎక్కువ. అందుకే ఇది వరకే ముహూర్తం కుదిరిన పెళ్లిళ్లను ఈనెల 31వరకు చేసుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఈనెల 31 తర్వాత కళ్యాణ మొచ్చినా కక్కొచ్చినా అనుమతి లేదని స్పష్టం చేశారు. 31 తర్వాత పెళ్లిళ్లకు అనుమతి లేదని.. మరో డేట్ ఫిక్స్ చేసుకోవాలని కేసీఆర్ తాజాగా ప్రజలను కోరారు.

ఇక శనివారం అర్ధరాత్రి నుంచి ఈనెల 31 వరకు జనాలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాలను నిర్మూలించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అన్ని రకాల విద్యాసంస్థలు - శిక్షణ కేంద్రాలు - ప్రత్యేక వేసవి క్యాంపులు ఇలాంటివన్నింటిని ఆదివారం నుంచి బంద్ చేయాలని కేసీఆర్ ఆదేశించారు.

ఇలా తెలంగాణ వ్యాప్తంగా కరోనా వ్యాప్తికి కేసీఆర్ పలు నిషేధాజ్ఞలు విధించారు. కళ్యాణాలను రద్దు చేయమనడం కలకలం రేపింది.
Tags:    

Similar News