కేసీఆర్ తిక్క రేగింది.. ఆయ‌న్ని ఎంత‌లా తిట్టారంటే?

Update: 2019-04-03 08:52 GMT
తిడితే ప‌డాలి. క‌సిరితే.. స‌ర్లేన‌ని ఊరుకోవాలి. మాట అంటే మ‌ర్చిపోవాలి. ఆరోప‌ణ చేస్తే అవున‌న్న‌ట్లుగా ఉండాలె. అంతేకానీ.. తిడితే రెండు తిట్ట‌టం.. క‌సిరితే క‌సి పుట్టేలా మాట‌ల్ని అనేయ‌టం.. మాట‌కు మాట ఎదురు చెప్ప‌టం.. ఆరోప‌ణ‌ల‌కు దిమ్మ తిరిగేలా కౌంట‌ర్లు వేయ‌టం ధ‌ర్మ‌మా?  అందునా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మీద‌నా?  తాను తిట్ట‌ట‌మే కానీ.. త‌న‌ను తిట్టినోళ్ల‌ను అస్స‌లు ఊపేక్షించ‌ని కేసీఆర్ తీరు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

ప్ర‌ధానిని ఉద్దేశించి సింఫుల్ గా స‌న్నాసి అంటూ కేసీఆర్ మాట అనొచ్చు కానీ.. రోజూ కేసీఆర్ మాదిరే ఉప్పు.. కారం తినే మోడీ ఒక అడుగు ముందుకేసి మాట అంటే.. ప్ర‌ధాని అన్న‌టోడు స‌ర్పంచ్ స్థాయికి దిగ‌జారి పోతారా? అంటూ ఎద్దేవా చేస్తారు. మ‌రి.. సీఎం స్థాయిలో ఉన్నోటోడు వార్డు మెంబ‌ర్ మాదిరి మాట్లాడొచ్చా? అన్న  విమ‌ర్శ‌లు విప‌క్ష నేత‌లు చేస్తున్నా ప‌ట్టించుకోరు. త‌న ధోర‌ణిలో తాను ఉండ‌ట‌మే త‌ప్పించి మిగిలిన విష‌యాల్ని ప‌ట్టించుకోని కేసీఆర్‌.. తాజాగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై శివాలెత్తారు.

త‌న‌కు తిక్క రేగితే మీ బండారం బ‌య‌ట‌పెడ‌తాన‌న్న ల‌క్ష్మ‌ణ్ మాట‌ల‌పై కేసీఆర్ కు ఒళ్లు మండిపోయిన‌ట్లుంది. తాజాగా ఆయ‌న మాట్లాడుతూ.. ఎవ‌డో బీజేపోడు.. నీ భ‌ర‌తం ప‌డ‌తాం అన్న‌డు. ఎక్కువ మాట్లాడుతున్నావ్‌?  నువ్వు నా భ‌ర‌తం ప‌ట్టేదేంది నా గోషా?   గొంగ‌డా?  ఏ చెకింగ్‌కు వ‌స్త‌వో రా బిడ్డా గ‌ట్ల‌నే బెదిరిస్తే ఇంకింత రెచ్చిపోతే.. నాకు తిక్క రేగితే నీ బండార‌మే బ‌య‌ట‌పెడ‌తానంటూ రివ‌ర్స్ వార్నింగ్ ఇచ్చేశారు.

కేసీఆర్ లాంటి అధినేత‌ను బండారం బ‌య‌ట‌పెడ‌తా.. భ‌ర‌తం ప‌డ‌తానంటే ఒప్పుకుంటారా?  నాటు ఉద్య‌మంలోనూ.. నేడు ప్ర‌భుత్వంలోనూ త‌న‌ను ప‌ల్లెత్తు మాట అన‌టానికి సైతం జంకేలా వ్య‌వ‌స్థ‌ల్ని త‌యారు చేసుకున్న వేళ‌.. ల‌క్ష్మ‌ణ్ లాంటి  నేత ఒక మాట అంటే కేసీఆర్ లాంటోళ్లు ఊరుకుంటారా? ఒక‌రికి అవ‌కాశం ఇస్తే.. దాన్ని అలుసుగా చేసుకొని మ‌రికొంద‌రు మాట‌లు అన‌టం మొద‌లెడితే.. ఇంత‌కాలం జాగ్ర‌త్త‌గా క‌ట్టుకున్న భ‌యం సామ్రాజ్యం ఏమ‌వుతుంది చెప్పండి?
    

Tags:    

Similar News