తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కీలకమైన అంశం ముస్లిం ఓటు బ్యాంకు. ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణలో ముస్లింల ఓట్లు చాలా ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాల్లోనే ముస్లింల ఓట్లు ఉన్నాయి. అయితే తెలంగాణలో దాదాపు 119 మంది నియోజకవర్గాల్లోనూ ముస్లింల ఓట్లు కీలకం. తెలంగాణ రాజధాని హైదరాబాద్ పాతబస్తీలో నిరాఘాటంగా గెలుస్తున్న పార్టీ ఎంఐఎం. ఇక్కడ ఈ పార్టీకి తిరుగులేదు. మిగిలిన రాజకీయ పార్టీలు కూడా పాతబస్తీ వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడేలాంటి పరిస్థితి. ఇక్కడ ఏడు స్ధానాలు మజ్లిస్ చేతిలోకి వెళ్లిపోతాయి. ఇక తెలంగాణలో మిగిలిన 112 స్థానాల్లోనూ ముస్లింల ఓట్లు అత్యంత కీలకంగా మారుతున్నాయి.
నిజానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని తీసుకున్న నిర్ణయం వెనుక ముస్లిముల ఓట్లే కారణమని కూడా చెబుతన్నారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలంగాణ శాసనసభ ఎన్నికలు కూడా జరిగితే భారతీయ జనతా పార్టీపైనా - ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనా ఉన్న ఆగ్రహంతో ముస్లిములు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారని - దీని వల్ల తాము నష్టపోతామని కె.చంద్రశేఖర రావు భావించినట్లు చెబుతున్నారు.
తెలంగాణలో రాజధాని హైదరాబాద్ ను మినహాయిస్తే దాదాపు తొమ్మిది జిల్లాల్లో ముస్లిముల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నిజం చెప్పాలంటే వారి ఓట్లే అభ్యర్ధి విజయాన్ని శాసిస్తాయి. నిజామాబాద్ - అదిలాబాద్ - మెదక్ - రంగారెడ్డి - నల్లగొండ - కరీంనగర్ - వరంగల్ - మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో కనీసం 60 నియోజకవర్గాల్లో ముస్లీం ప్రభావం ఉంటుంది. ఇక్కడ ముస్లిముల ఓటు ఇతరులతో పోలిస్తే తక్కువగానే ఉన్నా వారు నిర్ణాయక శక్తి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఖమ్మం - కొత్తగూడెం వంటి నియోజకర్గాల్లో కూడ వీరి ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుంది. ఏ నియోజకర్గంలోనూ 15 ఓట్ల కంటే ముస్లింల ఓట్లు తక్కువగా లేవు. కొన్ని చోట్ల 90 వేల వరకు ఉన్నాయి.
జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ - కాంగ్రెస్ పార్టీల పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ వైపు ముస్లీములున్నా తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ జత కట్టడం వారికి నచ్చలేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాటు భారతీయ జనతా పార్టీతో ఉండడం - మళ్లీ తనకు అవసరమైతే వారితో కలవడం చేస్తారనే భయం ముస్లీముల్లో నెలకొంది. దీంతో ఈసారి ఎన్నికల్లో పాతబస్తీ మినహాయించి మిగిలిన నియోజకవర్గాల్లో ముస్లీముల ఓట్లు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధులకే పడతాయని అంటున్నారు. దీనికి తోడు తన పాలనలో కె.చంద్రశేఖర రావు షాదీ ముబారక్ వంటి కార్యక్రమాలను అమలు చేయడం కూడా ఆ పార్టీకి కలిసొస్తుందంటున్నారు.