అధినేతలకు వ్యక్తిగత అభిరుచులు పాలన మీద ఎంతగా ప్రభావం చూపిస్తాయనటానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారమే నిలువెత్తు నిదర్శనం. తెలంగాణ రాష్ట్ర సంక్షేమం కోసం ఆయన అయుత చండీయాగాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు ఐదు రోజుల పాటుసాగే ఈ యాగానికి ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు. రోజుకు 50వేల మందికి భోజనాలంటే వచ్చే జనాల పరిస్థితి ఎంత భారీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
వందలాది మంది బ్రాహ్మణులు పూజాదికాలు నిర్వహించటమే కాదు.. దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో యాగాన్ని నిర్వహిస్తున్నారంటే.. యాగం రేంజ్ ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. అధికారికంగానే యాగానికి ఆరేడు కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. మరింత భారీగా సాగే యాగం కోసం కేసీఆర్ సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. మరి.. ఆయన తన సమయాన్ని యాగానికి వినియోగిస్తుంటే.. పాలనా వ్యవహారాల మాటేమిటి? అన్న ప్రశ్న దగ్గర సమాధానం దొరకని పరిస్థితి.
అలా అని.. ఈ విషయం మీద విమర్శించే అవకాశం లేదు. ఎందుకంటే.. తెలంగాణ ప్రజల బాగు కోసం చేస్తున్న యాగానికి అభినంధించకుండా విమర్శలు చేస్తున్నారంటే.. కచ్ఛితంగా కేసీఆర్ వ్యతిరేకులేనన్న భావనను పలువురు వ్యక్తం చేస్తారు. కానీ.. ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి ఒక యాగం కోసం తన విలువైన కాలాన్ని వినియోగిస్తే.. పాలనా సంబంధమైన పనులు ఎంతగా ఆగిపోతాయో.. సీఎం పేషీలో పని చేసే అధికారులకే తెలుసు. యాగానికి సంబంధించిన ఏర్పాట్ల కోసం దాదాపు నెల నుంచి తనకు వీలున్నప్పుడల్లా ఎర్రవెల్లి వెళ్లి వస్తున్న కేసీఆర్.. తన సమయంలో ఎక్కువ భాగానికి యాగానికే ఖర్చు చేస్తున్నారు.
ఎర్రవెల్లి నుంచి శనివారమే తిరిగి వచ్చిన ఆయన.. సోమవారం నుంచి ఫామ్ హౌస్ లోనే ఉండనున్నారు. యాగం 23 నుంచి మొదలు కానున్ననేపథ్యంలో రెండు రోజుల ముందే ఆయన ఎర్రవెల్లికి చేరుకోనున్నారు. యాగానికి ముందు చేయాల్సిన పూజా క్రతువులో ఆయన కూర్చోవాల్సి ఉంటుంది. అంటే.. ఈ నెల21 నుంచి 27 వరకు ఆయన అక్కడే ఉండనున్నారన్న మాట. అంటే.. మొత్తం ఏడు రోజులు పాలనా సంబంధమైన విషయాల మీద ఆయన పెద్దగా పట్టించుకునే అవకాశమే లేదు. సోమవారం ఎర్రవెల్లి వెళ్లే కేసీఆర్.. యాగం పూర్తి అయిన తర్వాత మాత్రమే హైదరాబాద్ కు తిరిగి వస్తారని చెబుతున్నారు. మరి.. ఇన్నేసి రోజులు పాలనను పట్టించుకోకపోతే.. ఎంత ఇబ్బందన్న విషయాన్ని ఆలోచించే వారెవరు..?