తెలంగాణలో బీజేపీ నేతల పరిస్థితి ఇప్పుడు గందరగోళంగా మారిందని అంటున్నారు. దీనికి కారణం ఎవరో తెలిస్తే...ఆశ్చర్యపోతారు. బీజేపీ రథసారథి, ఆ పార్టీ నేతల ఏకైక ఆశాదీపం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సాక్షాత్తు మోడీ చెప్పిన మాటలు ఇప్పుడు బీజేపీ నేతలు తెలంగాణలో ఇరకాటంలో పడేలా చేస్తున్నాయి. ఇదంతా దేని గురించి అంటే తెలంగాణలో రిజర్వేషన్ల కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం గురించి. వెనుకబడిన ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు - ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుని తెలంగాణ అసెంబ్లీ - మండలిలో ఆమోదించారు. ఈ బిల్లుని బీజేపీ సభ్యులు వ్యతిరేకించారు. అయితే బీసీ - ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర బీజేపీ నేతల తీరు బూమరాంగ్ లా మారింది.
బీజేపీ రాష్ట్ర నేతలు రిజర్వేషన్ల పెంపుని వ్యతిరేకిస్తుంటే..ప్రధాని నరేంద్ర మోడి మాత్రం అభివృద్ధికి నోచుకోని పేద ముస్లింలకు చేయూత అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఒడిశాలోని భువనేశ్వర్ లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో అన్ని వర్గాలను కలుపుకొనిపోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముస్లింలలోనూ పేదలు - వెనకబడిన వర్గాలున్నాయన్న మోడీ...వారికి అభివృద్ధి ఫలాలు అందించాల్సిన బాధ్యత బీజేపీపై ఉందన్నారు. ఓబీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదాపై చర్చ సందర్భంగా మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓబీసీలు 30 ఏళ్లుగా జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించాలని పోరాటం చేస్తున్నారని ప్రధాని మోడీ గుర్తు చేశారు. ఇటీవలే లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు.. రాజ్యసభలో నిలిచిపోయింది. ఈ బిల్లు ఆమోదం పొందితే.. వెనకబడిన వర్గాలుగా గుర్తించిన ఎవరికైనా రిజర్వేషన్ కల్పించే అధికారం పార్లమెంటుకు సంక్రమిస్తుంది.ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాఖ్ కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని.. ఈ సమస్య పరిష్కారానికి మనం కృషి చేయాల్సి ఉందని మోడీ పేర్కొన్నారు.
అయితే ఈ విషయాన్ని వెంటనే పట్టుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ శాసనమండలిలలో రిజర్వేషన్ల పెంపు బిల్లుని ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సానుకూలంగా ఉన్నా ఇక్కడ ఆ పార్టీ నేతలు వ్యతిరేకించడాన్ని తప్పుపట్టారు. దీంతో ఖంగుతినడం బీజేపీ నేతల వంతు అయిందని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/