తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న బంద్ నేటికీ 14 వ రోజుకిచేరింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో సహా మొత్తం 26 డిమాండ్లతో ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు దిగారు. ఆర్టీసీని కాపాడుకోవాలనే లక్ష్యంతో అటు సిబ్బంది, ఇటు ప్రభుత్వం రెండూ కలిసి ఒకే దారిన కాకుండా వ్యతిరేక దారుల్లో పయనం చేస్తుండటంతో సమస్యకి పరిష్కారం లభించడంలేదు. సమ్మె మొదలుపెట్టిన రోజే సీఎం కేసీఆర్ సమ్మెని వదిలి సాయంత్రం లోపు విధుల్లో చేరకుంటే అందరిని తొలగిస్తా అని ప్రకటన చేసారు. కానీ , సీఎం మాటలు ఎవరూ వినిపించుకోలేదు. దీనితో ఆర్టీసీలోని 48 వేలమందిని తొలగిస్తున్నట్టు సీఎం సంచలన ప్రకటన చేసారు.
మరోవైపు ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌లో భాగంగా డ్రైవర్‌కు రూ. 1,500, కండక్టర్‌కు రూ.1,000 ఇచ్చి తాత్కాలికంగా ప్రజల అవసరాలు తీర్చుతుంది. కానీ , ఈ తాత్కాలిక డ్రైవర్లు మద్యం సేవించి బస్సుల్ని నడుపుతూ అమాయకమైన ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇప్పటికే బస్సు ప్రమాదాలలో చాలామంది మరణించారు. మరికొంతమంది గాయాలపాలైయ్యారు. దీనిపై హై కోర్ట్ లో కూడా కేసు నడుస్తుంది. ఇప్పటికే సమ్మెని వదిలి కార్మికులు విధుల్లో చేరాలి అనిహైకోర్టు చెప్పగా .... ప్రభుత్వం తో చర్చలు సఫలం అయిన తరువాతే విధుల్లోకి వెళ్ళేది అని తేల్చి చెప్పారు. ఇకపోతే తెలంగాణ సర్కార్ కి కూడా హైకోర్టు అక్షింతలు వేసింది. ఇంతవరకు ఎందుకుఆర్టీసీకి కొత్త ఎండీని నియమించలేదు అని ప్రశ్నించింది. సత్వరమే కార్మికులతో మాట్లాడి ..ఈ సమస్యకి పరిష్కారం చూపండి అని తెలుపగా ... సీఎం కేసీఆర్ మాత్రం ఆర్టీసీ నాయకులతో చర్చలు జరపడానికి కూడా సిద్ధంగా లేనట్టు అర్థమౌతుంది.
రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని, 16 శాతం ఐఆర్ ఇచ్చామని.. సంస్థ కోసం 3300 కోట్లు సాయం చేశామని.. కానీ ఆర్టీసీ లాభాల బాట పట్టలేదని సమ్మె కారణంగా ఆర్టీసీ దాదాపు రూ. 150 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని.. పండుగ సీజన్లో కార్మికులు సమ్మెకు వెళ్లడం ఏంటని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.గడువులోగా డ్యూటీలో చేరని వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం లేదని కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. కొత్త సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వాలని.. బస్సులను అద్దెకు తీసుకోవాలని సీఎం అధికారులని ఆదేశించినట్టు సమాచారం. మరోవైపు ఆర్టీసీ కార్మికులు అన్ని ఉద్యోగ సంఘాలని కలుపుకొని సమ్మెని మరింత ఉదృతం చేయాలనీ భావిస్తున్నారు. ఇందులో భాగంగా ... రేపు తెలంగాణ వ్యాప్తంగా బంద్ చేయబోతున్నారు. ఈ బంద్ కి ఒక్క టిఆర్ఎస్ తప్ప ..మిగిలిన అన్ని పార్టీలు సంపూర్ణ మద్దత్తు తెలిపాయి. సమ్మె పై ఎవరూ కూడా బెట్టు విడవకపోవడంతో అటు ప్రభుత్వం ..ఇటు ఆర్టీసీ మధ్యలో ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నారు. చూడాలి మరి ఈ సమ్మె ఎటువైపు వెళ్లి ..ఎక్కడ ముగుస్తుందో ....