తెలంగాణలో రాజకీయాల అనూహ్య రీతిలో...రోజురోజుకు మారిపోతున్న సంగతి తెలిసిందే. ఇందులో అనూహ్యంగా తెరమీదకు వచ్చిన అంశం...టీఆర్ ఎస్ పార్టీతో టీడీపీ జట్టుకట్టడం. అయితే ఇవన్నీ అంచనాలు - ఆలోచనలు అంటున్నప్పటికీ...తెరవెనుక పెద్ద ఎత్తున్నే కసరత్తు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీఆర్ ఎస్ - టీడీపీ పరిణామాలను గమనించిన వారి సమాచారం ప్రకారం టీడీపీతో పొత్తు ప్రతిపాదనే రాజకీయాల్లో సంచలనం కాగా.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు కూడా సానుకూలంగా స్పందించారని అంటున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనంతపురం పర్యటన - అనంతర పరిణామాలతో టీడీపీలో కల్లోలం రేగడంతో ఎన్నికలకు ఏడాది ముందే తెలంగాణ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ఈ క్రమంలోనే అదనపు ఓటు బ్యాంకు కోసం టీఆర్ ఎస్ ముందస్తు ఎత్తుగడలకు శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ వ్యతిరేకతతోనే టీడీపీ పుట్టిందని - టీఆర్ ఎస్ కూ ఇపుడు కాంగ్రెస్సే ప్రధాన శతృవు కాబట్టి ఉమ్మడి శత్రువును ఎదుర్కొనేందుకు రెండు పార్టీలు చర్చించుకున్నట్లు సమాచారం. టీడీపీతో పొత్తు ప్రతిపాదన వెనుక.. టీఆర్ ఎస్ ద్విముఖ వ్యూహం స్పష్టమవుతోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా టీడీపీకి సంప్రదాయంగా ఉన్న ఓటుబ్యాంకును ఓన్ చేసుకోవడంతో పాటు వ్యక్తిగత దూషణలతో.. ప్రధానంగా టీఆర్ ఎస్ ను - సీఎం కుటుంబాన్ని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డికి పొగపెట్టినట్లవుతుందని భావించి ఈ వ్యూహానికి తెరతీసినట్లు చెప్తున్నారు. ష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ చర్చలకు కీలక సూత్రధారిగా ఉన్నట్లు సమాచారం. టీడీపీకి సంబంధించి ఒక ఎంపీ ద్వారా చర్చలు జరిగినట్లు రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ ఈ ప్రతిపాదన పట్ల మొగ్గుచూపడం వెనుక కూడా ఆసక్తికరమైన లెక్కలు ఉన్నాయంటున్నారు. రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని చాలా సెగ్మెంట్లలో ఆంధ్ర ప్రాంతం నుండి సెటిలైన ఓటర్లు ఎక్కువగా ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్ - ఖమ్మం - నల్లగొండ - నిజామాబాద్ - రంగారెడ్డి - వరంగల్ జిల్లాల్లోని నియోజకవర్గాల్లో సెటిలర్ల సంఖ్య ఎక్కువగా ఉండగా.. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఆ ఓటుబ్యాంకును సొంతం చేసుకో వచ్చని, ఇది శాశ్వతంగా పార్టీకి బలమైన ఓటుబ్యాంకును ఏర్పాటు చేస్తుందని టీఆర్ ఎస్ వ్యూహరచన చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే టీడీపీకి 12 అసెంబ్లీ స్థానాలు - రెండు ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు టీఆర్ ఎస్ సుముఖత వ్యక్తం చేసినట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే...టీడీపీని లక్ష్యంగా చేసుకుని.. ఇంతకాలం రాజకీయం చేసిన టీఆర్ ఎస్ శ్రేణులు ఈ పొత్తుల పరిణామాలను ఏ విధంగా అర్థం చేసుకుంటారన్న చర్చ కూడా జరుగుతోంది.