కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం అనంతరం మేడిపల్లి నుంచి కన్నెపల్లి పంపు హౌస్ కు గవర్నర్ తోపాటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేరుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1.07 గంటలకు పంపు హౌస్ ను గవర్నర్ నరసింహన్ ప్రారంభించగా.. అంతకు ముందు శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రాజెక్టు నీటిని మళ్లించే విధానం.. కీలకమైన పంపుహౌస్ ఎలా పని చేస్తుందన్న విషయాన్ని జగన్ కు వివరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ విషయాల్ని ఎంతో ఆసక్తిగా తెలుసుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి. తక్కువ సమయంలో భారీ నిర్మాణాన్ని ఎలా పూర్తి చేశారన్న వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా పంపుహౌస్ ప్రత్యేకతలు.. దాని నిర్మాణం గురించి ప్రాజెక్టును డీల్ చేసిన మేఘా ఇంజినీరింగ్ ఎండీ కృష్ణారెడ్డి వివరించారు.
భారీ పంపులు.. మోటార్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవటం.. ఇతర ప్రత్యేకతల గురించి జగన్ అడిగిన ప్రశ్నలకు గవర్నర్ నరసింహన్ తో పాటు.. ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానాలు ఇవ్వటం గమనార్హం. ఇదిలా ఉంటే.. లిఫ్ట్ ద్వారా పంపుహౌస్ లోపలకు వెళ్లి పరిశీలించాలని భావించారు. అయితే.. లిఫ్ట్ లో నలుగురికి మాత్రమే చోటుంది. దీంతో.. గవర్నర్ నరసింహన్.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. మెఘా కృష్ణారెడ్డి నలుగురే లిఫ్ట్ లో కిందకు వెళ్లారు. అక్కడ అప్పటికే ఉన్న అధికారులు పంపులు.. మోటార్లు..కాడా వ్యవస్థల గురించి ఈ ప్రముఖులకు వివరించారు. పంప్ హౌస్ కు వెళ్లే లిఫ్ట్ లో నలుగురు ప్రముఖులు.. మరే ఇతర భద్రతా అధికారి లేకుండా వెళ్లటం గమనార్హం.