రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. కానీ.. చేతిలో రాజ్యాధికారం ఉన్నోళ్లంతా తాము రాజులకు మించిన రాజులమని.. తామున్నది ప్రజాస్వామ్యమే అయినా.. తమకు తోచిన రాజరికాన్ని ప్రదర్శించేలా పాలకులు వ్యవహరిస్తున్న తీరు చాలాసార్లు చూస్తున్నదే. తాజాగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో నిర్మిస్తున్న అష్టభుజి ప్రాకార మండప రాతి స్తంభాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రంతో పాటు.. అధికార పార్టీ ఎన్నికల గుర్తు కారు.. కేసీఆర్ ప్రభుత్వంలో అమలు చేస్తున్న వివిధ రకాలైన ప్రభుత్వ పథకాలకు చెందిన బొమ్మల్ని రాతి స్తంభాల మీద చెక్కిన వైనం బయటకు రావటం.. పెద్ద ఎత్తున నిరసనలు.. ఆందోళనలు చోటు చేసుకోవటం తెలిసిందే.
దీంతో.. వెనక్కి తగ్గిన కేసీఆర్ యాదాద్రిలో ప్రభుత్వం చెప్పకుండానే.. అవాజ్యమైన అభిమానంతో కేసీఆర్ బొమ్మను.. ఆయన ప్రభుత్వ పథకాల్ని చెక్కేసిన శిల్పాలను మార్చాలన్న ఆర్డర్ వేశారు. దైవిక సంబంధమైన బొమ్మలు మినహా.. మిగిలిన అన్ని రకాల చెక్కడాల్ని చెరిపేయాలన్న ఆదేశాల్ని జారీ చేసినట్లు వైటీడీఏ ప్రధాన స్థపతి ఆనందచారి వేలు చెప్పారు. ఈ నేపథ్యంలో రాతిస్తంభాలపై ఉన్న వివాదాస్పద చిత్రాల్ని తొలగించే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు.
ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మను చెక్కిన శిల్పం మీద తాజాగా.. సుదర్శన చక్రాన్ని చెక్కాలని నిర్ణయించారు. అంతేకాదు.. తొలగించిన వాటి స్థానంలో లతలు.. హంసలతో పాటు.. దైవ సంబంధిత బొమ్మల్ని చెక్కాలంటూ మార్కింగ్ లైన్లు వేశారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు అయిన కారు స్థానంలో హంసను చెక్కటానికి ప్లాన్ చేశారు. ఇలా పలువురు నేతలు.. కేసీఆర్ ప్రభుత్వంలో అమలు చేస్తున్న పథకాల స్థానే లతలు.. హంసలు..పద్మాలు తదితర దైవ సంబంధమైన బొమ్మల్ని చెక్కాలని నిర్ణయించి.. ఆ దిశగా పనులు ప్రారంభించారు.