తెలంగాణ రాష్ట్రానికి తిరుగులేని ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్ ఎంతటి శక్తివంతుడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తికి ఖర్చులకు డబ్బులు అవసరమై.. బ్యాంకోళ్లతో మాట్లాడితే.. ఎలాంటి సమాధానం వస్తుంది? సీఎం స్థాయి వ్యక్తి ఖర్చులకు బ్యాంకోళ్లతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుందా? కాకితో కబురు పంపిస్తే డబ్బులు వచ్చి వాలవా? అన్న సమాధానం అందరి నోటా వస్తుంది.
కానీ.. పెద్దనోట్ల రద్దు పుణ్యమా అని సామాన్యులు.. అసమాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న వైనం సీఎం కేసీఆర్ తన నోటితో తానే చెప్పిన వైనం ఆసక్తికరంగా ఉండటమే కాదు.. సామాన్యుల కష్టాలు మీడియా చెబుతోంది కానీ.. అసమాన్యుల డబ్బు ఇక్కట్లను మీడియా ఏ మాత్రం కవర్ చేయలేదన్న భావనకు రావటం ఖాయం. ముఖ్యమంత్రికే నోట్ల కష్టాలతో ఎంతగా ఇబ్బంది పడుతున్నారో తెలిస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. అలాంటి ముచ్చటను తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పుకొచ్చారు.
పెద్దనోట్ల రద్దు కారణంగా కరెన్సీ కొరత ఇబ్బందిని తాను కూడా ఫేస్ చేసినట్లుగా ఆయన చెప్పొకొచ్చారు. ఆ మధ్యన పెద్దనోట్ల రద్దు ఇష్యూ మీద ప్రధాని మోడీతో మాట్లాడేందుకు ఢిల్లీకి వెళ్లిన వైనం తెలిసిందే. ఈ సందర్భంగా తోవ ఖర్చుల కోసం డబ్బులు అవసరమై.. బ్యాంకోళ్లతో కేసీఆర్ మాట్లాడారంట. దానికి బ్యాంకోళ్లు ఇచ్చిన సమాధానం.. రూ.24 వేలకు చెక్కు రాసి పంపిస్తే ఇస్తాం సార్ అంటూ వినమ్రతతో చెప్పారట.
చెక్కులతో డబ్బులు తీసుకోవటం అలవాటు లేనప్పటికీ మారిన పరిస్థితులకు తగ్గట్లు మారక తప్పలేదని.. చెక్కు రాసి డబ్బులు తెప్పించుకున్నట్లుగా కేసీఆర్ చెప్పుకొచ్చారు. రూ.24వేల కోసం ముఖ్యమంత్రే బ్యాంకోళ్లతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుందా? అన్న సందేహం వచ్చిందా? కానీ.. ముఖ్యమంత్రే స్వయంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందిని చెప్పినప్పుడు నమ్మక తప్పదుగా.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/