ఎలాగైనా సరే ముస్లిం వర్గాల్లో కూడా తన పార్టీకి ఆదరణను విపరీతంగా పెంచుకుని.. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించి తీరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా పట్టుదలగానే ఉన్నారు. అందుకోసం ముస్లిం వర్గాలను ఆకర్షించే అనేకానేక సరికొత్త పథకాలను ఆయన తరచుగా ప్రకటిస్తూనే ఉన్నారు. ఇదంతా తమ పార్టీకి లాభిస్తుందని తెరాస శ్రేణులు ఆశల్లో విహరిస్తున్నాయి. నిజమే కావొచ్చు. కొత్త హామీలు కచ్చితంగా ఆ పార్టీకి లాభించవచ్చు.. కానీ ముస్లింలకు సంబంధించినంత వరకు ఇచ్చిన పాత హామీలు వారి కలలకు బ్రేకులు వేసే ప్రమాదం కనిపిస్తోంది. అదే 12 శాతం రిజర్వేషన్ల వివాదం.
తెలంగాణలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని కొందరు ముస్లిం మేదావులు డిమాండ్ చేస్తున్నారు. కానీ మతం ప్రాతిపదికన రిజర్వేషన్ డిమాండ్ చేయడంపై వారు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. పైగా మత పర రిజర్వేషన్లను రాజ్యాంగం అనుమతించదుకూదా. కానీ దీనికి ముస్లింలను తప్పుపట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పెంటను నెత్తికెత్తుకున్నది ముఖ్యమంత్రి కేసీఆరే మరి.
తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలలోపు ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని 2014 శాసనసభ ఎన్నికల్లో వాగ్దానం చేసింది సాక్షాత్తూ కేసీఆరే. అలా వాగ్దానం చేసి ఇప్పటికి 17 నెలలయింది. ముస్లిలకు రిజర్వేషన్లూ లేవు. గిజర్వేషన్లూ లేవు. తమకు కేసీఆర్ చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలని ముస్లింలు కోరుకుంటే వారి తప్పెలా అవుతుంది?
ఇలాంటి పరిస్థితులను సృష్టిస్తున్నందుకు కేసీఆర్ వంటి నేతలనే తప్పుపట్టాలి. ఆంద్రలో కూడా ఇలాంటి పరిస్థితినే మనం చూస్తున్నాం కదా. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేసి యూపీఏ ప్రభుత్వాన్ని ఒప్పించిన బీజేపీ ఇప్పుడెలా అడ్డం తిరుగుతోందో మనందరికీ తెలిసిన విషయమే. చేతకాని వాగ్దానాలు, సాధ్యం కాని మాటలు గుప్పించడమెందుకు? జనాన్ని బురిడీలు కొట్టించడెమెందుకు? ఇప్పుడు అదే జనం చేత శాపనార్థాలు పెట్టించుకోవడం ఎందుకు?